ఎమ్మెల్యే చింతమనేనిపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Published : Sep 25, 2018, 01:31 PM ISTUpdated : Sep 25, 2018, 02:41 PM IST
ఎమ్మెల్యే చింతమనేనిపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

విలువలతో కూడిన రాజకీయాల కోసమే తాను పార్టీ పెట్టానని పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాలంటే సుదీర్ఘ పోరాటమనే విషయం తనకు తెలుసునని ఆయన అన్నారు. 

ఏలూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎన్నో కేసులున్నాయని, అయినా చర్యలు తీసుకోలేదని పవన్ కల్యాణ్ అన్నారు. చింతమనేనిని క్రమశిక్షణలో పెడుతారా, ప్రజల్నే నిర్ణయం తీసుకోమంటారా అని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడుతారనే గతంలో తాను టీడీపికి మద్దతు ఇచ్చానని, అయితే, ప్రభుత్వం దోపిడీదారుల కొమ్ముకాస్తోందని అన్నారు. 

2019 ఎన్నికల్లో తాను మార్పు తెస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే అడిగేవారు లేరని ఆయన అన్నారు. 

విలువలతో కూడిన రాజకీయాల కోసమే తాను పార్టీ పెట్టానని పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాలంటే సుదీర్ఘ పోరాటమనే విషయం తనకు తెలుసునని ఆయన అన్నారు. 

తన దగ్గరకు వచ్చేవాళ్లంతా తనకు ఓటేస్తారని కాదు, ప్రతి ఒక్కరూ సమస్యలు లేకుండా జీవించాలనేదే తన ఉద్దేశ్యమని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే