జగన్ రెడ్డి అంటే తప్పేమిటి, నాకే కులం అంటగడుతారా: పవన్ కల్యాణ్ సీరియస్ కామెంట్స్

Published : Nov 14, 2019, 01:56 PM ISTUpdated : Nov 14, 2019, 02:48 PM IST
జగన్ రెడ్డి అంటే తప్పేమిటి, నాకే కులం అంటగడుతారా: పవన్ కల్యాణ్ సీరియస్ కామెంట్స్

సారాంశం

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ సీెం వైఎస్ జగన్ పై, వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి అంటే తప్పేమిటని  పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 


విజయవాడ: ఏపీ సీఎం జగన్ క్రైస్తవ మతాన్ని నమ్ముతాడు, దాన్ని దాచాల్సిన అవసరం లేదు, తిరుపతి ప్రసాదం తింటాడో లేడో తనకు తెలియదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు.

గురువారం నాడు అమరావతిలో జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏపీ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అమలు గురించి ప్రశ్నిస్తే తనను పవన్ నాయుడు అంటున్నారని ఆయన గుర్తు చేశారు. 

తన తల్లి బలిజ సామాజిక వర్గానికి చెందింది.  అదే సామాజిక వర్గానికి చెందిన నేతలతోనే తనపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. తనపై విమర్శలు చేయించడాన్ని ఎవరితోనైనా చేయించాలని ఆయన మరోసారి వైసీపీ నేతలకు సూచించారు. జగన్‌ను జగన్ రెడ్డి అంటే తప్పెలా అవుతోందని ఆయన ప్రశ్నించారు.

జాతీయ మీడియా అంతా కూడ జగన్ ను జగన్ రెడ్డే అంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను కుల మతాలకు అతీతంగా ఉంటానని చెప్పారు. కుల, మతాలకు అతీంగా రాజకీయాలు చేయాలనేదే తన ఉద్దేశ్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు.

జగన్‌ను ఎలా పిలవాలో వైసీపీ నేతలు చెప్పాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు సమావేశమై జగన్ ను ఎలా పిలవాలో తీర్మానం చేసి చెబితే  అలానే పిలుస్తామని  ఆయన చెప్పారు.

భాషా సరస్వతిని కించపరిస్తే  మట్టికొట్టుకుపోతారని  పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏ భాష అన్నం పెడుతోందో ఆ భాషను కించపరిస్తే  తల్లికి ఏ గౌరవం ఇచ్చినట్టని ఆయన ప్రశ్నించారు.

కన్నడ భాషను విస్మరిస్తే కఠిన చర్యలు ఉంటాయని కన్నడ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఏపీలో మాత్రం తెలుగును విస్మరిస్తేనే బతికే  పరిస్థితులు తెచ్చారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

తెలుగు గురించి మాట్లాడితే తనకు కులం ఆపాదిస్తున్నారని చెప్పారు.. పవన్ కళ్యాణ్ ఏ కులం నుండి వచ్చారో చూడకండంటూ ఆయన వైసీపీ నేతలను హితవు పలికారు.  పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో ఆ విషయాలపై స్పందించాలని ఆయన చురకలంటించారు.

ఇంగ్టీష్ రాని  ఆయన డబ్బులు సంపాదించలేదా అని పరోక్షంగా మంత్రి బొత్స సత్యనారాయణపై పవన్ కళ్యాణ్ విమర్శలు ఎక్కుపెట్టారు. తామంతా ఒకే జాతి అనే భావన తెలంగాణలో ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

కానీ ఏపీలో మాత్రం కులాల వారీగా చీలిపోయారని పవన్ కళ్యాణ్ ఆవేదన చెందారు. హైద్రాబాద్‌కు తాను  వెళ్లిన కొత్తల్లో తెలంగాణ భాషను  విస్మరించారనే భావనను తాను గుర్తించినట్టుగా చెప్పారు. అయితే సినిమాల్లో తెలంగాణ భాషకు గుర్తింపు కోసం  తాను జానీ సినిమాలో ఓ పాటను పెట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తాను విధానాల పరంగా మాట్లాడుతోంటే వైసీపీ నేతలు మాత్రం వ్యక్తిగత విషయాలను వివాదాల్లోకి  తీసుకువస్తున్నారని వపన్ చెప్పారు. మీ ఇంగ్లీష్‌లో చెప్పాలంటే కామన్స్ సెన్స్ లేకుండా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో వైసీపీ నేతలపై మండిపడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం: అమలుకు స్పెషల్ ఆఫీసర్

Pawan: జగన్మోహన్ రెడ్డి మట్టిలో కలిసిపోతారు: పవన్ కల్యాణ్ శాపనార్థాలు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!