ఏపీ సీఎస్ గా నీలం సహాని బాధ్యతలు.. వారిద్దరి తర్వాత ఆమెదెే రికార్డు

Published : Nov 14, 2019, 01:07 PM ISTUpdated : Nov 14, 2019, 02:45 PM IST
ఏపీ సీఎస్ గా నీలం సహాని బాధ్యతలు.. వారిద్దరి తర్వాత ఆమెదెే రికార్డు

సారాంశం

నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా సతీనాయర్, మిన్నీ మాథ్యూలు పనిచేయగా నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని బాధ్యతలు స్వీకరించారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని పదవీ బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని సచివాలయంలో ఇంఛార్జ్ సీఎస్ నీరబ్ కుమార్ నుంచి నీలం సహాని బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు.  

ఇకపోతే నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా సతీనాయర్, మిన్నీ మాథ్యూలు పనిచేయగా నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని బాధ్యతలు స్వీకరించారు. 

ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం,ఎంపవర్మెంట్ కార్యదర్శిగా ఆమె పనిచేశారు. ఇటీవలే ఆమె కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు.1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో అసిస్టెంట్ కలక్టర్ గా పనిచేశారు. 

అనంతరం శ్రీకాకుళం జిల్లా టెక్కలి సబ్ కలక్టర్ గాను, నల్గొండ జిల్లా సంయుక్త కలక్టర్ గాను పని చేశారు. అలాగే మున్సిపల్ పరిపాలనశాఖ డిప్యూటీ సెక్రటరీగా,హైదరాబాదులో స్త్రీశిశు సంక్షేమశాఖ పిడిగాను పనిచేశారు. 

నిజామాబాదు జిల్లా డీఆర్డీఏ పీడీగానూ,ఖమ్మం జిల్లాల్లో కాడా(CADA)అడ్మినిస్ట్రేటర్ గా కూడా పనిచేశారు. అనంతరం ఇంధనశాఖలో సంయుక్త కార్యదర్శిగా, నల్గొండ జిల్లా కలక్టర్ గా పనిచేశారు. కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ గా, టిఆర్అండ్ బి కార్యదర్శిగా కూడా పనిచేశారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే క్రీడల శాఖ కమీషనర్ మరియు సాప్ విసి అండ్ ఎండిగా కూడా పనిచేశారు. అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా కేంద్రంలో పనిచేసిన అనంతరం ఎపిఐడిసి కార్పొరేషన్ విసి అండ్ ఎండిగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. ఆ తర్వాత స్త్రీ,శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 

2018 నుండి కేంద్ర సామాజిక న్యాయం మరియు ఎంవపర్మెంట్ కార్యదర్శిగా పనిచేస్తూ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో ఆమెకు పలువురు అధికారులు అభినందనలు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ: నేడు బాధ్యతల స్వీకరణ

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే