140 ఆలయాల ధ్వంసం... రెండున్నరేళ్ల ప్రగతి ఇదేనా, ఎక్కడ వైసీపీ గ్రామ సింహాలు: పవన్ మరో ఘాటు ట్వీట్

Siva Kodati |  
Published : Sep 28, 2021, 04:54 PM IST
140 ఆలయాల ధ్వంసం... రెండున్నరేళ్ల ప్రగతి ఇదేనా, ఎక్కడ వైసీపీ గ్రామ సింహాలు: పవన్ మరో ఘాటు ట్వీట్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ మంత్రులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆడియో ఫంక్షన్ల నుంచి సోషల్ మీడియా వరకు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ మంత్రులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆడియో ఫంక్షన్ల నుంచి సోషల్ మీడియా వరకు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆన్‌లైన్ టికెట్ల వ్యవహారం నుంచి మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలివాన అవుతూ గంట గంటకూ కొత్త మలుపు తీసుకుంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ వైసీపీ పాలనపై ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.

”హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం. ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు?” ”ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!” అంటూ ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ టికెట్ల విధానంపై (online ticket )డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగానే (cine distributors) ఉన్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) చెప్పారు.తన స్వార్ధం కోసమే ఆన్‌లైన్ టికెట్ విధానాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమకు ప్రయోజనం కల్గించేలా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోందని ఆయన చెప్పారు. 

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలోనే కొందరు స్పందిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సినీ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ గుదిబండగా మారారని ఆ పరిశ్రమకు చెందిన వారే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. రూ. 100 టికెట్ ను రూ. 1000 లేదా రూ. 2000లకు అమ్ముకోవాలని అనుకొనేవాళ్లకి నచ్చడం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అవకతవకలు లేకుండా అందరికీ న్యాయం చేసేందుకే ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని ఆయన చెప్పారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?