గుంటూరు జిల్లాలోని పెద్దనందిపాడు మండలం కొప్పర్రు ఘర్షణలో 25 మందిని అరెస్ట్ చేసినట్టుగా బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు.ఈ నెల 20న వినాయక విగ్రహల నిమజ్జనం సందర్భంగా కొప్పర్రులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.
గుంటూరు: గుంటూరు (guntur) జిల్లాలోని పెద్దనందిపాడు మండలం కొప్పర్రు (kopparru)ఘర్షణలో 25 మందిని అరెస్ట్ చేసినట్టుగా బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు (bapatla dsp Srinivasa rao) చెప్పారుఈ నెల 20వ తేదీన వినాయక విగ్రహల నిమజ్జనం (Vinayaka idol immersion)సందర్భంగా టీడీపీ(tdp), వైసీపీ (ycp)వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘర్షణకు సంబంధించి టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం పోలీసులకు (police)ఫిర్యాదు చేసుకొన్నాయి.
వైసీపీ ఫిర్యాదు మేరకు టీడీపీకి చెందిన 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీకి చెందిన 21 మందిపై కేసులు నమోదయ్యాయి.టీడీపీ,వైసీపీ వర్గాల పరస్పర దాడుల్లో 8 మంది వైసీపీ, ఐదుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే టీడీపీకి చెందిన 14 మందిని, వైసీపీకి చెందిన 11 మందిని అరెస్ట్ చేసినట్టుగా డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.ఈ నెల 20వ తేదీన టీడీపీకి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యురాలు శారద ఇంటిపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. తమపై టీడీపీ వర్గీయులే తొలుత దాడి చేశారని వైసీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.