అందుకు సిద్ధపడ్తా, సినిమాల్లో వంద కోట్లు సంపాదిస్తే...: పవన్ కల్యాణ్

By pratap reddyFirst Published Nov 4, 2018, 9:38 PM IST
Highlights

రాష్ట్రంలో అవినీతితో కూడిన రాజకీయ వ్యవస్థ నెలకొని ఉందని, దీన్ని చూస్తుంటే అసహ్యం వేస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. తనకు సినిమాలపై మమకారం లేదని సమాజంపై బాధ్యత ఉందని అన్నారు.

కాకినాడ: తాను ఓడిపోవడానికి సిద్ధపడుతాను గానీ పార్టీ విలువలను చంపబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు ఏటా సినిమాల్లో రూ. 100 కోట్లు సంపాదిస్తే అందులో 25 కోట్లు పన్నులు చెల్లిస్తానని చెప్పారు తూర్పు గోదావరి జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో అవినీతితో కూడిన రాజకీయ వ్యవస్థ నెలకొని ఉందని, దీన్ని చూస్తుంటే అసహ్యం వేస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. తనకు సినిమాలపై మమకారం లేదని సమాజంపై బాధ్యత ఉందని అన్నారు. కార్యకర్తలు కొట్టే చప్పట్లు, కేరింతలు తనను సంతోష పెట్టవని, వాటిని బాధ్యతగా స్వీకరిస్తానని అన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని పవన్ కల్యాణ్ చెప్పారు. సినిమాలు కేవలం అవగాహన కల్పించడానికేనని, రాజకీయాలు వాటిని పరిష్కరించడానికి దోహదపడతాయని చెప్పారు.
 
వ్యవస్థకు న్యాయం చేయాలంటే కులాలు ముఖ్యం కాదని జనసేన అన్ని కులాలను కలుపుకుని పోతుందని అన్నారు. టీడీపీ నాయకులకు పౌరుషం లేదని, అందుకే పార్లమెంటు తలుపులు మూసివేసి రాష్ట్ర ఎంపీలను అవమానించిన కాంగ్రెస్‌తో చేయి కలిపిందని అన్నారు. వ్యాపారులు ఎంపీలుగా వెళ్తుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయని అన్నారు. 

వాల్మీకి, యోగి వేమనల్లో మార్పు వచ్చినట్టే చంద్రబాబు మనసు కూడా మారుతుందనే చిన్నపాటి నమ్మకంతో 2014లో మద్దతు ఇచ్చానని, అయితే చంద్రబాబు ఇంకా నిద్రాణంలోనే ఉన్నారన్నారు.

click me!