వైఎస్ ఇస్తే అలా అన్నారు, చంద్రబాబు ఇప్పుడేం చేశారు: పవన్

By pratap reddyFirst Published Nov 4, 2018, 9:07 PM IST
Highlights

మైనింగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లాలో మైనింగ్ వల్ల సంభవించిన సమస్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతాడలో ఆయన ఆదివారంనాడు ఆయన పర్యటించారు. 

రాజమండ్రి: మైనింగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లాలో మైనింగ్ వల్ల సంభవించిన సమస్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతాడలో ఆయన ఆదివారంనాడు ఆయన పర్యటించారు. 

 గతంలో రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం మహేశ్వరి మండల్స్ పేరుతో మైనింగ్‌కు అనుమతిచ్చిందని, అయితే మైనింగ్ మాఫియాను ఆపేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు.  గెలిస్తే ప్రజలకు మేలు చేస్తారని చంద్రబాబుకి మద్దతు ఇచ్చానని, కానీ అవినీతి పనులు చేస్తుంటే సహించలేకపోతున్నానని అన్నారు. 

చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి పెరగడమే కాకుండా కాలుష్యం కూడా ఎక్కువగా పెరిగిపోయిందని, ప్రకృతిని కాపాడడమే జనసేన ముఖ్య లక్ష్యమని చెప్పారు. ఏ తప్పూ చేయకుంటే మైనింగ్ మాఫియా  తాను వస్తుంటే అడ్డంగా మట్టికుప్పలు వేయడం దేనికని అడిగారు. 

రావికంపాడు రైల్వేస్టేషన్‌వద్ద ఉన్న లేటరైట్‌ డంపింగ్‌ కేంద్రాన్ని కూడా పవన్ కల్యాణ్ పరిశీలించారు. అన్నవరం నుంచి కత్తిపూడి బహిరంగ సభకు వెళుతూ మధ్యలో ఉన్న లేటరైట్‌ నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు. 
 
అక్రమ మైనింగ్‌ను సమిష్టిగా ప్రతిఘంటించాల్సి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన వెంట నాందెడ్ల మనోహర్‌, జిల్లా నాయకులు ఉన్నారు. 

click me!