వైసీపీ విమర్శలకు జనసేనాని కౌంటరిచ్చారు. తనపై వైసీపీ విమర్శలపై ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. వైసీపీ నేతలకు నాలుగు వ్యాక్యాల్లో సమాధానం ఇచ్చారు.
అమరావతి: తనపై వైసీపీ (ysrcp) నేతల విమర్శలకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోమవారం నాడు కౌంటరిచ్చారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు.రిప్లబిక్ సిణిమా వేడుకల సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీకి చెందిన కొందరు నేతలను లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.ఈ విమర్శలపై ఏపీ రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, సినీ నటుడు పోసాని కృష్ణమురళిలు స్పందించారు.
also read:జగన్‌తో పోల్చుకోకు, ఎప్పుడు ప్రశ్నించాలో తెలియదు: పవన్ కళ్యాణ్ పై పోసాని ఫైర్
తుమ్మెదల ఝుంకారాలు
నెమళ్ళ క్రేంకారాలు
ఏనుగుల ఘీంకారాలు
వైసీపీ గ్రామసింహాల గోంకారాలు
సహజమే …
తుమ్మెదల ఝంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు కూడ సహజమేనని ఆయన సెటైర్లు గుప్పించారు.సోమవారం నాడు రాత్రి సినీ నటుడు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ తనపై విమర్శలు గుప్పించిన నేతలకు కౌంటరిచ్చారు. సినీమా టికెట్ల విషయంతో పాటు ఏపీ సర్కార్ తీసుకొన్న నిర్ణయాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నానిలు కూడ అంతే స్థాయిలో కౌంటరిచ్చారు.