జగన్‌తో పోల్చుకోకు, ఎప్పుడు ప్రశ్నించాలో తెలియదు: పవన్ కళ్యాణ్ పై పోసాని ఫైర్

By narsimha lode  |  First Published Sep 27, 2021, 8:08 PM IST

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై  సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన మండి పడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.జగన్ పై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. 
 


హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జనసేన చీఫ్ పవన్ (Pawan kalyan) కళ్యాణ్  ప్రశ్నించడంలో తప్పు లేదని, అయితే ఈ ఆరోపణలకు సాక్ష్యాలను చూపాలని సినీ నటుడు పోసాని కృష్ణమురళి (posani krishna murali) తేల్చి చెప్పారు.సోమవారం నాడు పోసాని కృష్ణ మురళి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.. వైఎస్ జగన్ తో పోల్చుకొనే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ కు ఉందా అని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తన ప్రశ్నలకు తానే సమాధానం చెప్పుకొంటారని పోసాని కృష్ణ మురళి ఎద్దేవా చేశారు. 

రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ను, మంత్రులను తిట్టడమేమిటని ఆయన  ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఏంటో ప్రపంచానికి తెలుసునని పోసాని కృష్ణమురళి చెప్పారు. అందుకే రెండు చోట్లా ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ఆయన మండిపడ్డారు.జగన్ కు కులపిచ్చి ఉందని పవన్ కళ్యాణ్ నిరూపిస్తారా అని ఆయన సవాల్ విసిరారు.ఎక్కడ, ఎప్పుడు ప్రశ్నించాలో పవన్ కళ్యాణ్ తెలియదన్నారు.

Latest Videos

చిరంజీవి  నోటి నుండి అమర్యాదకరంగా ఏనాడైనా మాటలు వచ్చాయా అని పోసాని కృష్ణమురళి చెప్పారు.చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న సమయంలో ముద్రగడ పద్మనాభాన్ని ఇబ్బందులు పెట్టిన విషయం పవన్ కళ్యాణ్ కు గుర్తు లేదా అని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ ఎందుకు  మాట్లాడలేదో చెప్పాలన్నారు. రెండేళ్లలో ఏపీ ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖల్ని మార్చాడన్నారు. 

చంద్రబాబునాయుడు సర్కార్ చేసిన అప్పులను తీరుస్తూ ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అవకాశాల పేరుతో పంజాబ్ అమ్మాయిని ఓ వ్యక్తి మోసం చేశాడని పోసాని కృష్ణమురళి చెప్పారు.ఈ విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించాడని  పోసాని తెలిపారు. బాధితురాలికి న్యాయం చేస్తే పవన్ కళ్యాణ్‌కు గుడి కడతానని పోసాని కృష్ణమురళి తెలిపారు.

చిరంజీవితో రాజకీయంగా తనకు అభిప్రాయబేధాలున్నా తాను ఏనాడూ కూడ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదని పోసాని కృష్ణమురళి తెలిపారు.  సినీ పరిశ్రమలో సమస్యలను పవన్ కళ్యాణ్ పరిష్కరించగలరని పోసాని కృష్ణమురళి చెప్పారు. 

పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి కాదు, సినీ పరిశ్రమ మనిషి అని పోసాని తెలిపారు. ఇండస్ట్రీ తనను బ్యాన్ చేసినా తానేం భయపడనని ఆయన తేల్చి చెప్పారు. రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొంటూ  పవన్ కళ్యాణ్  రూ. 10 కోట్ల  తీసుకొంటున్నట్టుగా అబద్దాలు చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. చప్పట్ల కోసం తప్పుడు మాటలు మాట్లాడొద్దని పోసాని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.

click me!