మంత్రి బొత్సను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్: సీఎంలా మాట్లాడుతున్నారంటూ సెటైర్

By Nagaraju penumalaFirst Published Sep 6, 2019, 5:47 PM IST
Highlights

బొత్స సత్యనారాయణ సీఎంలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. గతంలో రాష్ట్రం విడిపోతే తప్పేంటన్న మెుదటి వ్యక్తి బొత్స సత్యనారాయణ అంటూ మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇస్తే బాగుంటుందని సెటైర్లు వేశారు.

రాజోలు: ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టార్గెట్ గా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. బొత్స సత్యనారాయణ సీఎంలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. 

గతంలో రాష్ట్రం విడిపోతే తప్పేంటన్న మెుదటి వ్యక్తి బొత్స సత్యనారాయణ అంటూ మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇస్తే బాగుంటుందని సెటైర్లు వేశారు. తూర్పుగోదావరి జిల్లా దిండిలో జనసేన పార్టీ మేథోమథన సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అమరావతి రాజధానిపై ప్రత్యేకంగా మాట్లాడారు. 

తాను ఏనాడు రాజధాని అమరావతిని మార్చాలని చెప్పలేదని తెలిపారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని మాత్రమే చెప్పినట్లు స్పష్టం చేశారు. గ్రీన్ క్యాపిటల్ కట్టాలన్నదే తమ ఆకాంక్ష అని పవన్ చెప్పుకొచ్చారు.

రాజధానిని అమరావతి నుంచి తరలించడం కుదరదన్నారు. ఐదేళ్లపాటు పెట్టుబడులు పెట్టాక రాజధానిని ఎలా తరలిస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రూ.7వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని ఇప్పుడు రాజధాని తరలిస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 

ఇకపోతే కాపు రిజర్వేషన్ల అంశంపై కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు జనసేనాని పవన్. కశ్మీర్, తెలంగాణ సమస్యల ముందు కాపు రిజర్వేషన్ల అంశం చాలా చిన్నదని చెప్పుకొచ్చారు. 151 సీట్లు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించగలదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.  

మరోవైపు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విషయంలో ప్రభుత్వ ఆచితూచి వ్యవహరించి ఉంటే బాగుండేదని హితవు పలికారు. పోలీసులు కూడా సంయమనంగా ఉండాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.  

ఏపీలో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దతవుతున్నాయంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని అర్థమని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విమానాలు రద్దు చేసి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని తెలిపారు. 10నెలలుగా ఆలయాలకు నిధులు ఇవ్వడం లేదని, అర్చకుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శించారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

యూరియా కోసం అన్నదాత చనిపోవడం కలచివేసింది: పవన్ కళ్యాణ్

పవన్ అభిమానుల అత్యుత్సాహం...కానిస్టేబుల్ కి గాయాలు

click me!