
జనసేన అధికార ప్రతినిధుల పేరుతో విరాళాలు సేకరిస్తున్న మోసగాళ్ల పట్ల జాగ్రత్త, వారి చేతుల్లో మోసపోకండి అని జన సేనాని పవన్ కళ్యాన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిదుల పేరుతో మీడియా ముందు మాట్లాడే స్థాయికి వీరి ఆగడాలు పెరిగాయని అన్నారు. వారి ఆగడాలకు జనసేనకు ఎలాంటి సంబందం లేదని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి కారణమైన వ్యక్తులను ఉపేక్షించబోమని జనసేనాని తెలిపారు.
పార్టీ తరపున చర్చల్లో, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇంకా ఎవరిని నియమించలేదని, కొందరు పార్టీని తప్పుదారి పట్టించి లభ్ది పొందడానికి పార్టీ పేరుతో చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు.
త్వరలోనే పార్టీ తరపున అర్హులైన వ్యక్తులను పార్టీ కార్యకలాపాల కోసం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని పవన్ తెలిపారు. అధికారికంగా తాము ప్రకటించే వరకు ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు జనసేన నాయకుడు పవన్ తెలిపారు.
విరాళాలు,పార్టీ పండ్ పేరుతో నగదు డిమాండ్ చేసే వ్యక్తుల ,సంస్థల వివరాలను పార్టీ కార్యాలయాని తెలియచేయాలన్నారు. అలాంటి వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాయని అన్నారు. అలాంటి మోసాలను ఆపడానికి జనసేన శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపుపిచ్చారు.