విశాఖకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ : మోడీతో భేటీకానున్న జనసేనాని

By narsimha lode  |  First Published Nov 11, 2022, 5:23 PM IST

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శుక్రవారంనాడు  సాయంత్రం విశాఖపట్టణానికి బయలుదేరారు. ఇవాళ రాత్రికి ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.


విశాఖపట్టణం:జనసేన  చీఫ్  పవన్ కళ్యాణ్ శుక్రవారంనాడు సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖపట్టణానికి బయలు దేరారు.ఇవాళ రాత్రి ఎనిమిదిన్నర గంటలకు పవన్ కళ్యాణ్ ప్రధానితో భేటీ కానున్నారు. మూడేళ్ల తర్వాత ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ కానుండడం రాజకీయంగా  ప్రాధాన్యత చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో రోడ్ మ్యాప్ కోసం బీజేపీ నాయకత్వం నుండి ఎదురు చూస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో ప్రధాని భేటీతో  రోడ్ మ్యా.ప్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. వైసీపీపై పవన్ కళ్యాణ్ దూకుడుగా వెళ్తున్నారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన విధానాలపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ కూడా అదే స్థాయిలో వపన్ కళ్యాణ్ పై ఎదురుదాడికి దిగింది.గత నెల విశాఖలోచోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర  రాజకీయాలను మరింత వేడేక్కించాయి. విశాఖగర్జనకు హాజరయ్యేందుకు వచ్చిన మంత్రులకార్లపై జనసేన దాడికి దిగింది.అయితే ఈ దాడితో తమకు సంబంధం లేదని జనసేన తేల్చి చెప్పింది. ఈ ఘటనలో వందకుపైగా జనసేన నేతలు,కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో విశాఖలో జనవాణిని జనసేన వాయిదా వేసుకుంది.  విశాఖలో  పర్యటనను ముగించుకొని  పవన్ కళ్యాణ్ అమరావతికి చేరుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగినిస కొన్ని రోజులకే ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. 

Latest Videos

undefined

alsoread:విశాఖలో మోడీ టూర్: స్టీల్ ప్లాంట్ కార్మికులను శిబిరం నుండి పంపిన పోలీసులు

రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.ఈ విషయమై తన  ముందున్న ఆఫ్షన్లను కూడా ఆయన ప్రకటించారు.అయితే  ఈ విషయాలన్నింటిపై పవన్ కళ్యాణ్ ప్రధానితో చర్చించే అవకాశం లేకపోలేదని  రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీతో పొత్తు ఉండబోదని బీజేపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. జనసేనతో కలిసి తాము ముందకు సాగుతామని ఆ పార్టీ  నేతలు  ప్రకటించారు.


 

click me!