తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తీసుకుని కొడతా.. నేను యుద్దానికి రెడీ: వైసీపీ నాయకులపై పవన్ కల్యాణ్ ఫైర్

Published : Oct 18, 2022, 01:37 PM ISTUpdated : Oct 18, 2022, 02:48 PM IST
తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తీసుకుని కొడతా.. నేను యుద్దానికి రెడీ: వైసీపీ నాయకులపై పవన్ కల్యాణ్ ఫైర్

సారాంశం

వైసీపీ నాయకులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు పవన్ కల్యాణ్ మంచితనం చూశారని అన్నారు. ప్యాకేజ్ స్టార్‌ అనే సన్నాసి నా కొడుకులు ఎవరంటూ ఫైర్ అయ్యారు.

వైసీపీ నాయకులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు పవన్ కల్యాణ్ మంచితనం చూశారని అన్నారు. ప్యాకేజ్ స్టార్‌ అనే సన్నాసి నా కొడుకులు ఎవరంటూ ఫైర్ అయ్యారు. తప్పుడు ఆరోపణలు చేస్తే వైసీసీ నాయుకులను చెప్పు తీసుకోని కొడతానని తీవ్రవ్యాఖ్యలు చేశారు. తన చెప్పు తీసి మరి చూపించారు. పవన్ కల్యాణ్ ఈరోజు మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎనిమిదేళ్ల కాలంలో తాను ఆరు సినిమాలు చేశానని చెప్పారు. 100 నుంచి 120 కోట్ల రూపాయలు సంపాదించానని తెలిపారు. తన పిల్లల పేరు మీద డిపాజిట్ చేసిన డబ్బుతో జనసేన పార్టీ కార్యాలయం కట్టానని చెప్పారు.

జనసేన పార్టీ ఖాతాలు, లెక్కల వివరాలను పవన్ కల్యాణ్ వివరించారు. రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ. 12 కోట్లు, అయోధ్య రామాలయానికి రూ. 30 లక్షల విరాళం ఇచ్చినట్టుగా చెప్పారు.  పార్టీ పెట్టినప్పటీ నుంచి బ్యాంకు ఖాతాల్లోకి రూ. 15.58 కోట్ల కార్పస్‌ఫండ్ విరాళాలు వచ్చాయని తెలిపారు. కౌలు రైతు భరోసా యాత్రం రూ. 3.5 కోట్లు వచ్చాయని చెప్పారు. నా సేన కోసం నా వంతుకు రూ. 4 కోట్లు వచ్చాయని తెలిపారు. 

తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని పదే పదే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. విడాకులు ఇచ్చే తాను పెళ్లిళ్లు చేసుకున్నానని చెప్పారు. చట్టప్రకారమే వారికి భరణం చెల్లించానని తెలిపారు. మొదటి భార్యకు 5 కోట్ల డబ్బు, రెండో భార్య మిగిలిన ఆస్తి ఇచ్చానని అన్నారు. విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నా మీకేంటి అభ్యంతరం అని ప్రశ్నించారు. ఒక్కరిని పెళ్లి చేసుకుని.. 30 మంది స్టెపిన్‌లతో తిరిగే సన్నాసులకు తాను సమాధానం చెప్పేలా అంటూ మండిపడ్డారు. యుద్దం చేయడానికి తాను సిద్దంగా ఉన్నట్టుగా తెలిపారు. రాడ్లతోనా.. హాకీ స్టిక్కులతో దేంతో వస్తారో రండి తేల్చుకుందామని సవాలు విసిరారు. నేటి నుంచి యుద్దమే.. మీరు రెడీనా అని ప్రశ్నించారు. 

ఏరా వైసీపీ గుండాల్లారా, ప్యాకేజ్ అనే సన్నాసుల్లారా.. మెడ పిసికి చంపేస్తానని హెచ్చరించారు. లండన్, న్యూయార్క్‌లో పెరిగాననుకుంటున్నారా?... బాపట్లలో పుట్టా.. గొడ్డు కారం తిని పెరిగానని చెప్పారు. ఒంగోలు గోపాలనరగం వీధి బడిలో చదివా అని  తెలిపారు. వైసీపీలో కూడా బాలినేని శ్రీనివాస్ లాంటి కొందరు మంచి వాళ్లు కూడా ఉన్నారని తెలిపారు. వైసీపీవి క్రిమినల్ పాలిటిక్స్ అని.. తాను బలమైన సిద్దాంతంతో రాజకీయాలు చేస్తున్నాని తెలిపారు. ‘‘నా భావప్రకటనను నేను స్వేచ్చగా ప్రకటిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?