
భీమవరం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి యాత్రలో భాగంగా పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ ఉపవాస దీక్షలో ఉన్నారు. దీంతో నీరసంతో స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. పవన్ కల్యాణ్ అనారోగ్యం కారణంగా ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గ నేతలతో నిర్వహించాల్సిన భేటి వాయిదా పడింది. మద్యాహ్నం తరువాత ఈ భేటీ జరగనుంది.
ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నేతలు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. అందుకే మధ్యాహ్నం తరువాత మీటింగ్ జరగనుంది.