ఉల్లిపాయల లోడ్ మధ్యలో గంజాయి బస్తాలు....విజయవాడలో పుష్ఫ స్టైల్ స్మగ్లింగ్

Published : Jun 27, 2023, 11:32 AM IST
ఉల్లిపాయల లోడ్ మధ్యలో గంజాయి బస్తాలు....విజయవాడలో పుష్ఫ స్టైల్ స్మగ్లింగ్

సారాంశం

పుష్ప సినిమా స్టైల్లో పోలీసులు కళ్లుగప్పి గంజాయి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన ఓ ముఠా అడ్డంగా బుక్కయ్యింది.  

విజయవాడ :  సినిమాల ప్రభావమో లేక అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ మహిమో తెలీదుగానీ నేరగాళ్లు తెలివిమీరారు. పోలీసులకు చిక్కకుండా, ఆధారాలు లేకుండా తెలివిగా క్రైమ్ చేస్తున్నారు. అయితే పోలీసులకు కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నారు. ఇలా అతితెలివితో గంజాయి స్మగ్మింగ్ చేస్తున్న ఓ గ్యాంగ్ ను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా పట్టుబడింది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఓ స్మగ్లింగ్ ముఠా భారీగా గంజాయి విజయవాడకు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారిపై రెండు వాహనాలను పట్టుకున్నారు. ఓ కారు డిక్కీలో 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అందులోని వారిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇక మరో వాహనంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉల్లిపాయల బస్తాలకింద గంజాయి పెట్టి తరలించినా పోలీసులు గుర్తించారు.గోనెసంచుల్లో 255 కిలోల గంజాయిని ముటగట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. అనుమానంతో ఉల్లిపాయల బస్తాలు తీసిచూసిన పోలీసులకు గంజాయి బస్తాలు పట్టుబడ్డాయి. దీంతో గంజాయి బస్తాలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Read More  రూ.90 లక్షలు ఇవ్వండి.. రూ.కోటి పట్టుకెళ్లండి..! టెంప్టయ్యారో అంతే.. !!

ఇలా రెండు వాహనాల్లో పట్టుబడిన 400కిలోల గంజాయి విలువ రూ.80 లక్షలపైనే వుంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఆరుగురు స్మగ్లర్లను విజయవాడ కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu
చంద్రబాబు, పవన్‌పై 420 కేసులు పెట్టాలి: RK Roja Strong Comments on TDP, JSP | Asianet News Telugu