హైదరాబాద్ ఆఫీస్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్

Published : Aug 15, 2020, 09:46 AM IST
హైదరాబాద్ ఆఫీస్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్

సారాంశం

74వ స్వాతంత్ర దినోత్సవ  వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. 

74వ స్వాతంత్ర దినోత్సవ  వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. 

కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు జాతీయ పతాకానికి వందనం చేసిన అనంతరం భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు సుమాంజలి అర్పించారు. 

ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, తెలంగాణ ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ పార్టీ ముఖ్య నేతలు శ్రీ షేక్ రియాజ్, శ్రీ వై.నగేష్, అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్