స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం: రాయపాటి కోడలి విచారణకు బ్రేక్

By telugu team  |  First Published Aug 15, 2020, 8:45 AM IST

రమేష్ ఆస్పత్రి స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదంపై మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమత విచారణకు పోలీసులు బ్రేక్ ఇచ్చారు.


విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదంపై మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు కోడలు మమత విచారణకు పోలీసులు విరామం ఇచ్చారు. ఈ అగ్నిప్రమాదం ఘటనపై మమతకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ పోలీసు కమిషనర్ ఆఫీసులో ఆమెను శుక్రవారం విచారించారు. దాదాపు 6 గంటలపాటు ఆమెను పోలీసులు విచారించారు. 

కరోనా వైరస్ నుంచి మమత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆ విషయం తెలియక పోలీసులు ఆమెను విచారించారు. విషయం తెలిసిన తర్వాత విచారణకు పోలీసులు ఆమె విచారణకు విరామం ఇచ్చారు. ఆమె కరోనా చికిత్స తీసుకుంటున్నట్లు తెలియదని పోలీసులు చెప్పారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత తిరిగి విచారిస్తామని ఏసీపీ సూర్యచంద్ర చెప్పారు. 

Latest Videos

undefined

Also Read: కులం అంటగడ్తారా: స్వర్ణ ప్యాలెస్ ఘటనపై రమేష్ బాబు

విచారణలో మమత నుంచి కీలకమైన విషయాలను రాబట్టామని దర్యాప్తు అధికారి ఏసీపీ సూర్యచంద్రరావు మీడియాతో చెప్పారు. మొత్తం పది మందికి నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. డాక్టర్ మమత విచారణకు హాజరయ్యారని చెప్ాపరు. కోవిడ్ కారణంగా మమత విచారణకు బ్రేక్ ఇచ్చినట్లు తెలిపారు. 

డాక్టర్ మమత అగ్నిప్రమాదం జరిగిన స్వర్ణ ప్యాలెస్ కేర్ సెంటర్ పర్యవేక్షణ కూడా చేశారని ఆయన చెప్పారు. రిమాండులో ఉన్న ముగ్గురిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. నోటీసులు అందుకున్నవారంతా విచారణకు సహకరిస్తారని భావిస్తున్నామని, సహకరించకపోతే సెక్షన్ -171 కింద అరెస్టు చేసే అధికారం తమకు ఉందని ఆయన చెప్పారు.

Also Read: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం: రమేష్ ఆస్పత్రికి వైఎస్ జగన్ ప్రభుత్వం షాక్

అంతకు ముందు మమత మీడియాతో మాట్లాడారు. తనపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని చెప్పారు. రమేష్ ఆస్పత్రి ఆపరేషన్ కు సంబంధించిన అంశాలను మాత్మరే తాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ తో తనకు ఏ విధమైన సంబంధం లేదని డాక్టర్ మమత చెప్పారు. విజయవాడ పోలీసులు నోటీసు ఇవ్వడం వల్ల తాను హాజరైనట్లు తెలిపారు. 

click me!