చేనేత బ్రాండ్ అంబాసిడర్ నేనే : పవన్ కల్యాణ్

By AN Telugu  |  First Published Aug 7, 2021, 1:15 PM IST

ఇందులో భాగంగా ‘జనసేన చేనేత వికాస విభాగం’ ఏర్పాటు చేశాం.  చేనేత కళాకారుల సమస్యల పరిష్కారం, వారి అభ్యున్నతికి ఈ వికాస విభాగం పాటుపడుతుంది.  ఈ ఉత్పత్తులకు మరింత ప్రచారం కల్పించేందుకు నన్ను నేను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించిన ప్రకటించుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. 

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన భారత దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన కళారంగం చేనేత అని పవన్ కొనియాడారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘భారతీయ కళల గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా మాట్లాడవలసింది చేనేత కళా రంగం గురించే.. నా పక్షాన, జనసేన పక్షాన చేనేత కళాకారులందరికీ హృదయపూర్వక కళాభివందనాలు.  చేనేత అభివృద్ధికి జనసేన కూడా ఇతోధిక కృషి చేస్తూనే ఉంది.

Latest Videos

ఇందులో భాగంగా ‘జనసేన చేనేత వికాస విభాగం’ ఏర్పాటు చేశాం.  చేనేత కళాకారుల సమస్యల పరిష్కారం, వారి అభ్యున్నతికి ఈ వికాస విభాగం పాటుపడుతుంది.  ఈ ఉత్పత్తులకు మరింత ప్రచారం కల్పించేందుకు నన్ను నేను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించిన ప్రకటించుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. 

ఈ కృషి ఇక మీదట కూడా ఇదే విధంగా కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. చేనేత దినోత్సవం సందర్భంగా యావత్ జాతికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. చేనేతను ధరిద్దాం -చేనేత కళాకారులను ప్రోత్సహిద్దాం.. భారతీయ  చేనేత  కళారంగాన్ని  కాపాడుకుందాం’ అని  పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
 
click me!