హోదాకు తూట్లు పొడిచింది చంద్రబాబు ప్రభుత్వమే : పవన్ కళ్యాణ్

First Published May 23, 2018, 6:08 PM IST
Highlights

హోదాకు తూట్లు పొడిచింది చంద్రబాబు ప్రభుత్వమే : పవన్ కళ్యాణ్

ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం చేస్తున్నపుడే తెలుగు దేశం పార్టీ తమతో గొంతు కలిపుంటే ఇప్పటికే హోదా వచ్చి ఉండేదని టిడిపి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. అప్పుడు ప్రత్యేక హోదా సంజీవని కాదని చెప్పి ఇపుడు అదే హోదా కోసం చంద్రబాబు నిరసన కార్యక్రమాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నరు. అసలు ప్రత్యేక హోదా ఉద్యమానికి తూట్లు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబేనని విమర్శించారు పవన్. మొత్తం రాష్ట్రానికి కాదు వెనుకబడిన శ్రీకాకుళం కు కూడా ప్రత్యే హోదా అడిగే దైర్యం చంద్రబాబు చేయడం లేదని పవన్ విమర్శించారు. 

శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్ చేపటతున్న పోరాట యాత్ర టెక్కలికి చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో పవన్ ప్రసంగిస్తూ...స్థానిక మంత్రి అచ్చెన్నాయుడి పై విరుచుకుపడ్డారు. 2014 లో ఆయనకు మద్దతు పలికినందుకు ఇపుడు బాధ పడుతున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజల అండతో మంత్రిగా ఎదిగి ప్రజా సమస్యలను ఆయన గాలికి వదిలేశాడని విమర్శించారు. ముఖ్యంగా ఉద్దాన్నం కిడ్నీ బాధితులకు అండగా నిలవక పోవడం బాధాకరమని విమర్శించారు.

ప్రజలు తమ కిడ్నీ సమస్యలను చెప్పుకోడానికి ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరమని, ఈ శ్రీకాకుళం లో తాను యాత్ర ముగించే లోపు మంత్రిని నియమించకుంటే నిరాహార దీక్షకు దిగుతానని పవన్ హెచ్చరించారు. పక్క దేశం శ్రీలంకలో ఇలాగే ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధ సడుతుంటే స్వయంగా దేశ అద్యక్షుడు తన కార్యాలయం నుండి సమీక్షించారని, కానీ ఈ సీఎం కనీసం పట్టించుకునే పాపాన పోవడం లేదన్నారు.  
 
తాను ప్రశ్నించడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిందని పవన్ గుర్తు చేశారు. అయితే అరకోరగా వీటిని ఏర్పాటు చేయడం వల్ల సరిపోవడం లేదని విరివిగా వీటిని ఏర్పాటు చేయాలని పవన్ ప్రభుత్వాన్ని సూచించారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులే ప్రస్తుత టిడిపి ప్రభుత్ం చేస్తుందన్నారు పవన్. ఉత్తరాంధ్ర వెనుకబాటును రూపుమాపడానికి కృషి చేయడం లేదని అన్నారు. ఇందుకోసం  శ్రీకాకుళం ప్రజలు కృషి చేయాలని సూచించారు.  సరికొత్త రాజకీయ, సామాజిక మార్పు కోసం యువతను ముందుకు రావాలని, వారిని తాను నమ్ముతానని పవన్ స్పష్టం చేశారు.

ఇక జిల్లాలో భావన పాడు పోర్టుకోసం రైతుల నుండి 2 వేల ఎకరాలు లాకుని ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని పవన్ తెలిపారు. షిప్పింగ్  కార్పోరేషన్ ఆప్ ఇండియా ఇస్తానన్న 26 శాతం లాభాన్ని కాదని ఆదాని గ్రూప్ ఇస్తామన్న 2.6 శాతం లాభానికి ఒప్పుకున్నారని తెలిపారు.  ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతో ఎంతలా లాలూచీ పడుతుందో తెలుసుకోడానికి ఇదే నిదర్శనమని పవన్ విమర్శించారు. 

click me!