యువ శక్తి రాజకీయ శక్తిగా మారాలి, నేను మారుస్తా: పవన్ కళ్యాణ్

By Nagaraju TFirst Published Jan 10, 2019, 3:41 PM IST
Highlights

 జ‌న‌సైనికులంతా నాయ‌కులుగా మార్పు చెందాల్సిన అవ‌స‌రం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గురువారం విజ‌య‌వాడ జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో క‌డ‌ప జిల్లా నేతలతో సమావేశమైన పవన్ రాబోయే ఎన్నిక‌లు జనసేనకు ఒక పెద్ద సవాల్ అంటూ చెప్పుకొచ్చారు.
 

విజయవాడ: జ‌న‌సైనికులంతా నాయ‌కులుగా మార్పు చెందాల్సిన అవ‌స‌రం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గురువారం విజ‌య‌వాడ జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో క‌డ‌ప జిల్లా నేతలతో సమావేశమైన పవన్ రాబోయే ఎన్నిక‌లు జనసేనకు ఒక పెద్ద సవాల్ అంటూ చెప్పుకొచ్చారు.

 జ‌న‌సేన‌కు యువ‌త, మ‌హిళ‌లు అండగా ఉన్నారని చెప్పారు. మహిళలు, యువత అండతో జనసేన పార్టీ ఎన్నికల్లో భారీ విజయం సాధించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. జ‌న‌సేన నిర్వ‌హించిన క‌వాతుల‌కి ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా త‌ర‌లివ‌చ్చారంటే అది వారిలోని ఆగ్ర‌హాన్ని తెలియజేస్తోందన్నారు. 

జనసేన ఒక ఏకీకృతమైన అభివృద్ది చెందాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. అది పోరాటాల ద్వారానే సిద్ధిస్తుందన్నారు. సంక్రాంతి తర్వాత క‌మిటీలు వేయ‌డానికి రెడీ అవుతున్నట్లు పవన్ స్పష్టం చేశారు. క‌డ‌ప జిల్లాకి సంబంధించి రాజంపేట, క‌డ‌ప పార్ల‌మెంటు స్థాయి క‌మిటీలు ఉంటాయన్నారు. 

డ‌బ్బులు రాజ‌కీయాల‌ని శాసించ‌లేవ‌ని ప‌లు సంద‌ర్భాల్లో రుజువైందన్నారు. రాజ‌కీయ పార్టీలు భావ‌జాలంతో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే చిర‌కాలం మ‌నుగ‌డ సాగిస్తాయన్నారు. రాజ‌కీయాల్లో ఆధిప‌త్యం కోసం కాకుండా వ్య‌వ‌స్థలో మార్పు కోసం జ‌న‌సైనికులు కృషి చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

 జ‌న‌సేన‌లో యువ‌త రాజ‌కీయ శ‌క్తిగా మార‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుందన్న ఆయన వారిని రాజ‌కీయ శ‌క్తిగా మార్చే బాధ్య‌త‌ను తానే తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి యువత ఓటే కీలకమన్నారు పవన్ కళ్యాణ్.

ఈ వార్తలు కూడా చదవండి

రాజకీయాల్లో అలాంటి నాయకుడు ఒక్కరూ లేరు: పవన్ ఆవేదన

 

click me!