ఉయ్యూరు జన్మభూమి సభలో రసాభాస

By narsimha lodeFirst Published Jan 10, 2019, 3:33 PM IST
Highlights

కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో జరిగిన జన్మభూమి సభ రసాభాసగా మారింది. టీడీపీ, వైసీపీల మధ్య తోపులాట చోటు చేసుకొంది. రెండు పార్టీల  కార్యకర్తలు కుర్చీలు విసురుకొన్నారు.

ఉయ్యూరు: కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో జరిగిన జన్మభూమి సభ రసాభాసగా మారింది. టీడీపీ, వైసీపీల మధ్య తోపులాట చోటు చేసుకొంది. రెండు పార్టీల  కార్యకర్తలు కుర్చీలు విసురుకొన్నారు.

కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో గురువారం నాడు జరిగిన జన్మభూమి సభలో  టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం సాగింది. ఒకానొక దశలో  ఉద్రిక్తత నెలకొంది.

ఇవాళ జరిగిన జన్మభూమి సభలో వైసీపీ నేత రామచంద్రరావు జన్మభూమి సభలో  డ్వాక్రా రుణాల మాఫీ గురించి ప్రశ్నించారు.  ఈ సమయంలోనే ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు  రామచంద్రరావుకు మధ్య మాటల యుద్దం చోటు చేసుకొంది. 

అదే సమయంలో జన్మభూమి సభ వద్దకు వచ్చి మాజీ మంత్రి పార్ధసారధి కూడ టీడీపీ నేతలను నిలదీశారు.ఈ  సమయంలోనే  రెండు పార్టీల మధ్య వాగ్వావాదం, తోపులాట చోటు చేసుకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జన్మభూమి సభ నుండి వైసీపీ నేతలను పోలీసులు పంపించివేశారు.
 

click me!