కుటుంబ పాలనను తరిమికొడదాం, మార్పు తీసుకొద్దాం: పవన్ కళ్యాణ్

By Nagaraju penumalaFirst Published Feb 24, 2019, 9:56 PM IST
Highlights

రాష్ట్ర రాజకీయాలు కొంతమంది కుటుంబాల చేతుల్లోనే ఉండిపోయిందన్నారు. తరతరాలుగా వారే రాజకీయాలను శాసిస్తూ ఇతరులను ఎదగనివ్వడం లేదన్నారు. వారిపాలనతో ప్రజలు విసుగు చెందిపోయారన్న పవన్ కళ్యాణ్ ప్రజలు స్వేచ్ఛ రాజకీయాలను కోరుకుంటున్నారని అది జనసేనతోనే సాధ్యమన్నారు. 

కర్నూలు: తనకు ఓటమి భయం లేదని, గెలుపు ముఖ్యం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను సమాజంలో మార్పు తీసుకురాడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లా బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర రాజకీయాలు కొంతమంది కుటుంబాల చేతుల్లోనే ఉండిపోయిందన్నారు. తరతరాలుగా వారే రాజకీయాలను శాసిస్తూ ఇతరులను ఎదగనివ్వడం లేదన్నారు. వారిపాలనతో ప్రజలు విసుగు చెందిపోయారన్న పవన్ కళ్యాణ్ ప్రజలు స్వేచ్ఛ రాజకీయాలను కోరుకుంటున్నారని అది జనసేనతోనే సాధ్యమన్నారు. 

తాను ప్రజల మనిషినని పార్టీల మనిషిని కాదన్నారు. జనసేన ఉనికిని చంపుకునే పని ఎప్పుడూ చేయనని పవన్ చెప్పారు. ఇకపోతే రాబోయే ఎన్నికల్లో తాను వామపక్షాలతోనే కలిసి పోటీ చేస్తామని మరే పార్టీతో కలిసి పోటీ చెయ్యడం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

మరోవైపు జనసేన పార్టీపై తప్పుడు ప్రచారం జరుగుతుందని దాన్ని ప్రజలు కార్యకర్తలు నమ్మెుద్దని సూచించారు. తనకు పేపర్లు, చానెళ్లు లేవన్న పవన్ జనసైనికులే తనపేపర్లు, చానెళ్లు అంటూ  వ్యాఖ్యానించారు. 

తాను ప్రజలను నమ్మి రాజకీయాల్లోకి వచ్చానే తప్ప ఏవో చానెల్స్ ను నమ్మి రాలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా చేరుకున్నారు. 

కర్నూలులో మూడు రోజులపాటు బస చేయనున్నారు. 25న ఆదోని నియోజకవర్గంలో పర్యటించి అక్కడ రైతులతో పవన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పవన్ పాల్గొంటారు. 26న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కాటంరాయుడు రాజుపై ఎదురు తిరిగినట్లు రౌడీ రాజకీయాలను తరిమికొట్టాలి: పవన్ పిలుపు

click me!