పవన్ కళ్యాణ్ కు షాక్: పర్యటనకు నో చెప్పిన మార్కెట్ కమిటీ

By Nagaraju penumalaFirst Published Dec 4, 2019, 6:02 PM IST
Highlights

రాష్ట్రవ్యాప్తంగా టమోటా రేటు విపరీతంగా పెరగడంతో మదనపల్లిలోని టమోటా మార్కెట్ సందర్శనకు వెళ్లి అక్కడ రైతులు, కొనుగోలు దార్లతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. 
అందులో భాగంగా మార్కెట్ కమిటీ కార్యదర్శి అనుమతి కోరారు పవన్ కళ్యాణ్. పవన్ పర్యటనకు మార్కెట్ కమిటీ అనుమతి నిరాకరించింది. 

చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చింది మదనపల్లి మార్కెట్ యార్డ్ కమిటీ. పవన్ పర్యటనకు అనుమతి నిరాకరించింది మార్కెట్ యార్డు కమిటీ. చిత్తూరు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం 10 గంటలకు మదనపల్లిలోని మార్కెట్ ను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా టమోటా రేటు విపరీతంగా పెరగడంతో మదనపల్లిలోని టమోటా మార్కెట్ సందర్శనకు వెళ్లి అక్కడ రైతులు, కొనుగోలు దార్లతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. 
అందులో భాగంగా మార్కెట్ కమిటీ కార్యదర్శి అనుమతి కోరారు పవన్ కళ్యాణ్. పవన్ పర్యటనకు మార్కెట్ కమిటీ అనుమతి నిరాకరించింది. మార్కెట్ రద్దీ దృష్ట్యా అనుమతి ఇవ్వడం లేదని అధికారులు స్పష్టం చేశారు. 

పోలీసుల నిర్ణయంపై జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇకపోతే మంగళవారం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తిరుపతిలో రైతు బజార్‌కు వెళ్లారు. ఉల్లి కొరత, ధరలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. గృహిణుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 

ఢిల్లీ కేంద్రంగా పవన్ వ్యూహం: జగన్ పై పవర్ అటాక్, డైరెక్షన్ వారిదేనా....

పవన్ కళ్యాణ్ తిరుపతి రైతు బజార్ లో పర్యటించడంతో పెద్ద ఎత్తున అభిమానులు, జనసేన కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. స్థానికులు కూడా పెద్ద ఎత్తున తరలిరావడంతో  అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  

పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు వచ్చి చేరుకోవడంతో కొందరు ఉల్లిపాయలను కాళ్ల కింద తొక్కుతూ పైపైకి వచ్చారు. దాంతో పవన్ అక్కడున్నవారినందరిని మందలించడంతోపాటు దయ చేసి ఉల్లిని తొక్కొద్దంటూ విజ్ఞప్తి చేశారు. స్వయంగా పవన్ వంగి నేలపై చెల్లా చెదురుగా పడిపోయిన ఉల్లిపాయల్ని ఏరడం అంతా ఆసక్తి కూడా నెలకొంది. 

షాపై పవన్ వ్యాఖ్యలు: విపక్షాల్లో చీలిక, వైసీపీతో గొంతు కలిపిన మిత్రపార్టీ

click me!