
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ విప్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ ఓ అవివేకి అంటూ దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు నాయుడు తన ఇంటికి వచ్చి అడిగితే మద్దతు ఇచ్చేవాడినని పవన్ వ్యాఖ్యానించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.
ప్రదాని నరేంద్రమోదీ సీబీఐ విశ్వసనీయతను దెబ్బతీశారని విమర్శించారు. రాఫెల్ కుంభకోణంతో దేశ భద్రతకు భంగం కలిగించారని మండిపడ్డారు. వ్యవస్థలను నాశనం చేస్తున్న మోదీని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణకై పోరాటం చేస్తున్నారని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ లు ఎటువైపు ఉంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవస్థను నాశనం చేసిన మోదీ వైపా, ప్రజాస్వామ్య పరిరక్షణకై పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు వైపా అంటూ నిలదీశారు డొక్కా.
ఈ వార్తలు కూడా చదవండి