నేనయితే అంత అమరావతి కట్టను

First Published Nov 11, 2016, 5:08 AM IST
Highlights

అంత పెద్ద రాజధాని  అమరావతి అవసరం లేదు. శక్తి కి మించిన పనులు కష్టాల పాలు చేస్తాయి. మయన్మార్ రాజధాని కట్టుకుని దివాళా తీసింది.  

నేనయితే శక్తి కి మించిన అమరావతి కట్టను అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. 

 

జనసేన  నేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ రోజు సూటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి  కలలనగరి అమరావతి మీద  మిసైల్  విసిరాడు. తన 2019 రాజకీయ ప్ర స్థానంలో రెండో రోజు  ఈ రోజు  అనంతపురం జిల్లా గుత్తిలో మాట్లాడుతూ, ’ నేనే ఆ స్థానంలో ఉంటే, ఇంత పెద్ద అమరావతిని కట్టే వాడిని కాదు,’ అని ప్రకటించేరు.

 

శక్తిని మించిన భారం వేసుకుని, పెట్టుబడుల కోసం ప్రపంచమంతా తిరుగుతూ  ఈ దేశాన్ని ’తాకట్టులో భారత దేశం’ చేయనని అన్నారు. విప్లవ నాయకుడు తరిమెల నాగిరెడ్డి పుస్తకం ’తాకట్టులో భారత దేశం’ సారాంశమిదే నని చెబుతూ లేని పోని ఖర్చులకు పోయి అపులు చేసిన దేశాన్నితాకట్టు పెట్టారని తరిమెల నాగిరెడ్డి చెప్పారని అన్నారు.

 

తన మిడిల్ క్లాస్ కుటుంబం అనుభవం చెబుతూ, తన కుటుంబంలో కార్యాలపుడు ఎక్కవ నగలు లేకపోవడం మీద బాధపడుతున్న మహిళలకు, తన కుటుంబ పెద్దలు ’ శక్తికి మించి నగలు కొన రాదు.మన తాహతు లోనే ఉందా’ మని చెప్పి మాటలు గుర్తు చేశారు.

 

రాష్ట్రాన్నిమంచిగా పరిపాలించేందుకు  ఒక కుర్చి అటు ఇటు తిరగడానికి ఒక కారు చాలు నని అన్నారు.

 

 ఈ సందర్భంగా పెద్ద రాజధాని కట్టి కష్టాల పాలవుతున్నా మయాన్మార్ అనుభవాన్ని ఉదహరించారు. మయన్మార్ అప్పులు చేసి నేప్యిదా (Naypyidaw) ( పై చిత్రం) అనే  సుందరమయిన రాజధానిని నిర్మించింది. ఇపుడేమయింది?  రాజధాని ప్రజల మీద భారమయింది. దేశం అప్పుల వూబిలో కూరుకుపోయిందిని చెప్పారు.

 

  ఎవరయినా సరే తాహతుకు మించి ఖర్చు మీద వేసుకోరాదు, ఇది అమరావతిరాజధానికి కూడా వర్తిస్తుందని చెప్పారు

 

క్లుప్తంగా జనసేన తన చంద్రబాబు నాయుడి  వరల్డ్ క్లాస్ రాజధానిని ఒక్క సారిగా నిర్మించడానికి వ్యతిరేకం అని చెప్పారు. ఇలాంటి భారీ నిర్మాణాలు మనల్ని అప్పుల్లోకి నెడుతాయని హెచ్చరించారు. పవన్ రాజకీయాలలో హార్డ్ లైన్ తీసుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

 

 

click me!