పత్తికొండ ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్ ఉమామహేశ్వరీ ముందుజాగ్రత్త చర్యలు తీసుకొన్నారు. తన చాంబర్ లో తాడును అడ్ంగా కట్టారు. ఈ తాడు దాటి ఎవరిని లోపలికి అనుమతించడం లేదు.
కర్నూల్: అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం ఘటనతో కర్నూల్ జిల్లాకు చెందిన రెవిన్యూ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. కర్నూల్ జిల్లా పత్తికొండ కు చెందిన తహసీల్దార్ ఉమా మహేశ్వరీ తన చాంబర్‌లో అడ్డంగా తాడు కట్టించారు. ఈ తాడు బయట నుండే ఆర్జీలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.
AlsoRead విజయారెడ్డి హత్య ఎఫెక్ట్: ఆంధ్ర ఎమ్మార్వోల ముందు జాగ్రత్త...
undefined
ఈ నెల 4వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిని సురేష్ అనే వ్యక్తి ఆమె చాంబర్‌లోనే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈ ఘటనలో అతను కూడ గాయపడ్డారు. ఈ ఘటనతో కర్నూల్ జిల్లా పత్తికొండ ఎమ్మార్వో ఉమా మహేశ్వరీ తన చాంబర్‌లో అడ్డంగా తాడు కట్టించారు.
AlsoRead
విజయారెడ్డిపై దాడి ఘటనతో ఉమా మహేశ్వరీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు. తనను కలిసి సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చేందుు వచ్చేవారంతా ఈ తాడు బయట నుండే వినతి పత్రాలు ఇవ్వాలని ఎమ్మార్వో సూచించారు.
AlsoRead
మా జాగ్రత్త మేం తీసుకోవాలి కదా అందుకే తన చాంబర్‌లో ఇలా తాడు కట్టించినట్టుగా ఎమ్మార్వో ఉమా మహేశ్వరి చెప్పారు. తన చాంబర్లో తాడు లోపలికి ఎమ్మార్వో ఎవరిని అనుమతించడం లేదు.
ఈ నెల 4వ తేదీన అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిని సురేష్ అనే వ్యక్తి సజీవ దహనం చేశారు. సజీవ దహనం కేసుకు ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ రంగు పులుముకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య విమర్శలు చేసుకంటున్నారు.
ఎమ్మార్వో విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి భూ వివాదం కేసులో హత్య చేశాడు. ప్రస్తుతం సురేష్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సురేష్ కోలుకొన్న తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
అబ్దుల్లాపూర్‌మెట్టు ఘటనతో ఏపీలో కూడ ఎమ్మార్వోలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. ఇందులో భాగంగానే పత్తికొండ ఎమ్మార్వో ఉమా మహేశ్వరీ తన చాంబర్‌లో తాడును అడ్డంగా కట్టారు. తమ ప్రాంతంలో ఈ తరహా దాడులు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.