ఇన్‌ఛార్జ్ సీఎస్‌గా నీరభ్ కుమార్ బాధ్యతలు: రిలీవ్ అయిన ఎల్వీ

Published : Nov 06, 2019, 10:46 AM ISTUpdated : Nov 06, 2019, 11:19 AM IST
ఇన్‌ఛార్జ్ సీఎస్‌గా నీరభ్ కుమార్ బాధ్యతలు: రిలీవ్ అయిన ఎల్వీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జి సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీని నియమించే వరకు నీరబ్ తాత్కాలిక సీఎస్‌గా వ్యవహరిస్తారు.

ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జి సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీని నియమించే వరకు నీరబ్ తాత్కాలిక సీఎస్‌గా వ్యవహరిస్తారు. కాగా.. సీఎస్ బాధ్యతల నుంచి ఎల్వీ సుబ్రమణ్యం రిలీవ్ అయ్యారు. అనంతరం నీరబ్‌కు బాధ్యతలను అప్పగించారు. 

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేస్తూ సోమవారం నాడు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని బాపట్ల హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఏపీ సీసీఎల్ఏ సెక్రటరీ గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్‌ను ఇంచార్జీ సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.జీఎడీ ప్రిన్సిపల్ సెక్రటీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ఇటీవల కాలంలో బిజినెస్ రూల్స్ మార్చడంతో పాటు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సీరియస్ అయ్యారు. ఈ మేరకు ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

సీఎం ఆదేశాల మేరకే  ప్రవీణ్ ప్రకాష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టుగా  సమాచారం. అయితే తనకు తెలియకుండానే బిజినెస్ రూల్స్ మార్చడంతో పాటు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజినెస్ రూల్స్ తో పాటు కండక్ట్ రూల్స్‌ను అతిక్రమించాడని ఆరోపిస్తూ  ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసులను జారీ చేశాడు. 

Also Read:షోకాజ్ నోటీసుల ఎఫెక్ట్: ఎల్వీ బదిలీ, కొత్త సీఎస్ రేసులో వీరే..

ఈ వ్యవహరం ఏపీ సీఎం వైఎస్ జగన్ కు , సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య అగాధం పెరిగిందనే ప్రచారం సాగుతోంది.ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం  జీఎడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌కు నోటీసులు జారీ చేసినట్టుగా చెబుతున్నారు.

సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కు సోకాజ్ నోటీసులు జారీ చేయడంపై సీఎం సీఎం వైఎస్ జగన్  అసంతృప్తి వ్యక్తం చేస్తూ  సీఎస్ బదిలీ చేసినట్టుగా సమాచారం. బాపట్ల హెచ్ఆర్‌డీ డైరెక్టరర్ జనరల్‌గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంచార్జీ సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్‌ను నియమించారు. మరో వైపు ఏపీ సీఎస్ గా నీలం సహాని, సమీర్ శర్మల పేర్లను  ప్రభుత్వం ఏపీ సీఎస్‌గా నియమించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.

Also Read:జగన్ సీరియస్: సిఎస్ ఎల్వీ బదిలీ వెనక అసలు ట్విస్ట్

నీలం సహాని 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. సమీర్ శర్మ 1985 బ్యాచ్ అధికారి. సమీర్ శర్మ ప్రస్తుం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. నీలం సహాని 2020 జూన్ 30వ తేదీన రిటైర్ కానున్నారు.

 సమీర్ శర్మ 2021 నవంబర్ 30వ తేదీన రిటైరౌతారు. మరో వైపు కేంద్ర సర్వీసుల్లో ఉన్న అజయ్ సహాని కూడ 1984 బ్యాచ్ అధికారి. అజయ్ సహాని 2022 ఫిబ్రవరి 28న రిటైర్ కానున్నారు. అజయ్ సహాని కూడ  సీఎస్ పదవి రేసులో ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే