తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన బోగీలో ప్రయాణీకులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తిరుమల: తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నుండి తిరుపతికి రైలు చేరుకుంది. ఈ సమయంలో రైలులోని ఓ బోగీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ బోగీలో ప్రయాణీకులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపివేసి మంటలను ఆర్పివేశారు.
గతంలో కూడా పలు ప్రాంతాల్లో రైలు బోగీల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది నవంబర్ 18న నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. నవజీవన్ ఎక్స్ ప్రెస్ పాంట్రీ బోగీలో మంటలు వ్యాపించాయి. ఈ మంటలను గమనించిన రైల్వే సిబ్బంది గూడూరులో రైలును నిలిపివేసి మంటలను ఆర్పివేశారు.ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
undefined
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఏడాది జూలై 3న దక్షిణ్ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. ఘట్ కేసర్ -పగిడిపల్లి స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఈ మంటలను గమనించిన రైల్వే సిబ్బంది రైలును నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. దక్షిణ్ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణకు ఆదేశించారు.
ముంబై నుండి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటన ఈ ఏడాది జూన్ 27న జరిగింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలులోని ఏసీ బోగీలో మంటలు వ్యాపించాయి.ఈ విషయాన్ని గుర్తించిన రైలు సిబ్బంది రైలును డోర్నల్ జంక్షన్ వద్ద నిలిపివేసి మంటలను ఆర్పారు. చండీఘడ్ - కోచ్‌పల్లి రైలులో 2019 సెప్టెంబర్ 6న అగ్ని ప్రమాదం జరిగింది.