మంటల్లో చిక్కుకున్న కావేరి ట్రావెల్స్ బస్సు... రూ.20లక్షల నగదు బూడిదపాలు

By telugu teamFirst Published Nov 27, 2019, 9:33 AM IST
Highlights

ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కనిగిరి నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంక్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. 
 

ఓ ప్రయివేట్ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపాలెం దగ్గర ప్రయివేట్ బస్సులో మంటలు చెలరేగాయి. కావేరి ట్రావెల్స్ కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే ప్రయణికులు దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సు పూర్తిగా దగ్ధమైంది. 

ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కనిగిరి నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంక్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. 

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా బస్సుకి మంటలు అంటుకోగా భయంతో పరుగులు తీశారు. దీంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే... ఈ మంటల్లో ఓ ప్రయాణికుడికి నష్టం ఏర్పడింది. తనతోపాటు తీసకువెళ్తున్న దాదాపు 20లక్షల నగదు.. బస్సు మంటల్లో కాలి బూడిదయ్యింది. 

మల్లూరి రమణయ్య అనే ప్రయాణికుడు 20 లక్షల నగదున్న బ్యాక్‌ను తనవెంట తీసుకెళ్తున్నాడు. బస్సుకు మంటలు అంటుకున్నాయన్న ఆందోళనలో బ్యాగ్‌ను బ్ససులోనే వదిలేసి  పరిగెత్తాడు. దీంతో 20 లక్షల రూపాయలు పూర్తిగా కాలిపోయాయని బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు.

మరో ప్రయాణికుడికి చెందిన లక్షా 50వేల విలువైన మొబైల్‌ మంటల్లో దగ్దమైంది.  సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. బస్సు పూర్తిగా దగ్ధం అయింది.

click me!