చంద్రబాబు కేసీఆర్ కు మోకరిల్లి విజయవాడకు పారిపోయి వచ్చారు

First Published May 9, 2018, 3:42 PM IST
Highlights

ఓటుకు నోటు కేసులో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పార్థసారథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ: ఓటుకు నోటు కేసులో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పార్థసారథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు వల్లనే చంద్రబాబు కేసీఆర్ కు మోకరిల్లి హైదరాబాదు వదిలి విజయవాడకు పారిపోయి వచ్చారని ఆయన అన్నారు. 

చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఓటును కొనేందుకు రూ.50 లక్షలు చంద్రబాబు ఇప్పించారని, ఆడియో టేపుల్లో గొంతు చంద్రబాబుదేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 

రాజ్యాంగ వ్యవస్థలు ఏమీ చేయలేవనే ధీమాతో టీడీపి నేతలు ఉన్నారని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని న్నారు. ఓటుకు నోటుపై సిబిఐ చేత లేదా ఉన్నతస్థాయి సంస్థ చేత విచారణ జరిపించాలని ఆయన అన్నారు. 

ఓటుకు నోటు కేసు రెండు రాష్ట్రాల సమస్య కాదని,త ఈ కేసు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు.  ఈ కేసు వల్లనే పదేళ్ల రాజధాని హైదరాబాదును చంద్రబాబు వదులుకున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కును చంద్రబాబు తాకట్టు పెట్టారని, అనవసరమైన ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపారని అన్నారు. 

కేసు వల్లనే తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా చంద్రబాబు అడ్డుకోలేకపోయారని అన్నారు. ప్రధానులుగా ఉన్నవారిపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా విచారణ చేశారని, అలాంటిది చంద్రబాబుపై ఎందుకు విచారణ జరిపించడం లేదని పార్థ సారథి అన్నారు. 

కోర్టు చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పడం సిగ్గు చేటు అని అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉందని స్టీఫెన్ సన్ సుప్రీంకోర్టుకు స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

click me!