ఇలాంటి నగరం ప్రపంచంలో మరెక్కడా లేదు

First Published May 9, 2018, 3:37 PM IST
Highlights

కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు

రాష్ట్ర రాజధాని అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు.. పలు విషయాలపై కలెక్టర్లతో చర్చించారు. నూతన ఆలోచనల సృష్టికి కలెక్టర్ల సమావేశం దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 

 సంక్షోభంలోనూ జట్టుగా పనిచేసి అభివృద్ధి సాధించామన్నారు. రాష్ట్రం సాధించిన ఫలితాలలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉందని బాబు తెలిపారు. నిరంతరం శ్రమతోనే విజయం సిద్ధిస్తుందని...మనసుపెడితే అద్భుతాలు చేయవచ్చని అన్నారు. అమరావతిని ఏరియల్ సర్వేలో పరిశీలించిన నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులు.. ఇటువంటి నగరం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారని చంద్రబాబు తెలిపారు. 

భారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీమ్ తమదే అని పేర్కొన్నారు. టీమ్ సమర్ధవంతంగా పనిచేస్తే ఏదైనా సాధించగలమన్నారు.లీడర్‌గా నూరు శాతం ఫలితాలు సాధించాలంటే... తమ దగ్గర పనిచేసే టీమ్‌ చాలా ముఖ్యమని తెలిపారు. తాము చేపడుతున్న కార్యక్రమాలను ధనిక రాష్ట్రాలు కూడా అమలు చేయలేకపోయాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 2029 కంటే ముందే దేశంలో ఏపీ నెంబర్‌వన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

తమని చూశాక ఆ నమ్మకం రెట్టింపయ్యిందని కలెక్టర్లను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోని ఇన్నోవేటర్స్ ఏపీకి వచ్చేలా చూడాలని తెలిపారు. వాళ్ల ఆవిష్కరణలకు మన రాష్ట్రం వేదిక కావాలని కలెక్టర్లకు సూచించారు. భారత్‌లో ఇన్నోవేషన్ వ్యాలీ అంటే ఏపీనే గుర్తకురావాలన్నారు. ప్రతీశాఖ వినూత్న ఆవిష్కరణలపై ఎక్కువగా దృష్టిపెట్టాలని తెలిపాు. నూతన ఆవిష్కరణల్లో పంచాయతీరాజ్‌ శాఖ ముందుందని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.

click me!