టీడీపీకి పరిటాల ఫ్యామిలీ గుడ్ బై... క్లారిటీ ఇచ్చిన శ్రీరామ్

Published : Mar 16, 2020, 10:19 AM IST
టీడీపీకి పరిటాల ఫ్యామిలీ గుడ్ బై... క్లారిటీ ఇచ్చిన శ్రీరామ్

సారాంశం

పార్టీ వీడుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో మాకు ఏదో విభేదాలు ఉన్నాయంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని.. అవన్నీ అతస్యమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఒకరి తర్వాత మరికొరు కీలకనేతలంతా.. పార్టీని వీడుతున్నారు. నిన్న, మొన్నటిదాకా... పార్టీ కోసం తాపత్రయపడిన నేతలంతా ఇప్పుడు అధికార వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాగా... ఈ జాబితాలో పరిటాల కుటుంబం కూడా చేరిపోయిందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

పరిటాల కుటుంబాన్ని చంద్రబాబు సరిగా పట్టించుకోవడం లేదని ఈ క్రమంలోనే అసంతృప్తి తో పరిటాల కుటుంబం కూడా పార్టీ మారేందుకు సన్నాహాలు  చేస్తోందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో.. ఈ రూమర్స్ పై మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ స్పందించాడు.

పార్టీ వీడుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో మాకు ఏదో విభేదాలు ఉన్నాయంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని.. అవన్నీ అతస్యమని చెప్పారు.

Also Read జగన్ ప్రభుత్వం ఫైట్: ఈసీ నిమ్మగడ్డకు సీఎస్ నీలం సహానీ లేఖ...

తమకు పార్టీ మారే ఉద్దేశం కూడా లేదని తేల్చి చెప్పారు. తన తండ్రి  పరిటాల రవీంద్ర సిద్ధాంతాలతో ఆయన ఆశయసాధన కోసం తెలుగుదేశం పార్టీని బలంగా నమ్మి ప్రజా అభివృద్ధి కాంక్షిస్తూ నిత్యం ప్రజాసేవలో కొనసాగుతున్నామని చెప్పాడు. అలాంటి తమ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

 కన్నతల్లి లాంటి పార్టీని తాము వీడమని.. అలాంటి దుష్ప్రచారం చేస్తున్నవారంతా మూర్ఖులని ఆయన పేర్కోన్నారు.  పసువు జెండా వదిలి పక్క పార్టీ వైపు చూసే దురాలోచన మాకు రాదు రాబోదని చెప్పారు. తల్లి పాలు తాగి తల్లికే ద్రోహం చేసే సంస్కృతి మాకు లేదన్నారు. తరాలు మారినా తరగని అభిమానంతో పసుపు జెండా కోసం పని చేస్తామన్నారు.

 కార్యకర్తలకు అండగా ఉంటామని.. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇకనైనా ఇలాంటి రాతలు రాసే వారు నీతి మాలిన రాతలు మాని సమాజంలో నీతిగా బతకండి అంటూ మీడియా సంస్థలకు చురకలు వేశారు. తాము  పార్టీ మారుతున్నట్లు జరగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేద అంటూ పరిటాల శ్రీరామ్ మరోసారి స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Cordon and Search Operation in Nellore: రౌడీలకు మందు బాబులకు చుక్కలే | Police | Asianet News Telugu
రైతులకు పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ చేసిన Minister Anam Ramanarayana Reddy | Asianet News Telugu