కొద్దిరోజుల క్రితం సదరు అనుమానితుడు హైదరాబాద్‌కి వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి ఏలూరు గవర్నమెంటు హాస్పటల్‌లో ఐసోలేషన్ వార్డులో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో కరోనా అనుమానిత కేసు నమోదైంది. కృష్ణా జిల్లా కైకలూరు వద్ద ఆచవరానికి చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్టు వైద్యులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం సదరు అనుమానితుడు హైదరాబాద్‌కి వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి ఏలూరు గవర్నమెంటు హాస్పటల్‌లో ఐసోలేషన్ వార్డులో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా... సదరు వ్యక్తికి సంబంధించిన వ్యక్తులపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ కలకలం రేపుతోంది.
undefined
తెలంగాణలో మరో కరోనా కేసు నమోదైంది. ఇప్పటి వరకు రెండు కరోనా కేసులను గుర్తించగా.. తాజాగా మూడో కేసును అధికారులు గుర్తించారు. నెదర్లాండ్ నుంచి 10 రోజుల కిందట రాష్ట్రానికి వచ్చిన రంగారెడ్డి జిల్లావాసి(48) కి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం కలగడంతో.. అతని సాంపిల్స్ ని పూణేకి పంపించారు.
కాగా.. ఆ పరీక్షల్లో అతినికి కరోనా సోకిందని నిర్థారణ అయ్యింది. కాగా... సౌదీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ హోస్టెస్ లో మాత్రం ఈ వైరస్ లేదని నిర్థారించారు. దీంతో ఇప్పటివరకు మూడో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడు దుబాయి నుంచి రాగా.. రెండో బాధితురాలు మలి నుంచి వచ్చారు. కాగా... ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి కావడం గమనార్హం.
తొలి బాధితుడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించగా... కోలుకొని ఇటీవల డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరాడు. కాగా... బాధితుల కుటుంబసభ్యులను కూడా ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Also Read కరోనావైరస్: మహారాష్ట్రలో మరో ఐదు పాజిటివ్ కేసులు, భారత్ లో 102...
ఇదిలా ఉండగా...ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ లో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా... అతనికి వైద్యసేవలు అందించిన వారిపై కూడా అధికారులు దృష్టిసారించారు. మొత్తం అతనికి 34మంది వైద్యం అందించగా.. వారిలో ఇద్దరికి లక్షణాలు సోకినట్లు అనుమానం కలగడంతో వారిని రక్తనమూనాలకు కూడా పరీక్షల నిమిత్తం పూణే పంపారు. వారిని కూడా ఇతరులకు దూరంగా ఉంచుతున్నారు.