వెనక్కి తగ్గని నిమ్మగడ్డ రమేష్ కుమార్: ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు

By AN TeluguFirst Published Feb 6, 2021, 10:41 AM IST
Highlights

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగియగానే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని  రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. రేషన్ వాహనాల రంగులపై రాసిన లేఖలో ఈ మేరకు పరిషత్ ఎన్నికల గురించి ప్రస్తావించారు. 

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కి తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగియగానే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని  రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. రేషన్ వాహనాల రంగులపై రాసిన లేఖలో ఈ మేరకు పరిషత్ ఎన్నికల గురించి ప్రస్తావించారు. 

వాహనాలకు పరిషత్ ఎన్నికలదాకా తటస్థ రంగులే వేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే వైసీపీ రంగులు పునరుద్ధరించవద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది. 

అంతేకాదు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యేదాకా తటస్థ రంగులే కొనసాగించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జోరందుకున్న సంగతి తెలిసిందే. 

click me!