మదనపల్లి హత్యలు: అదే భ్రమలో తల్లిదండ్రులు, కూతుళ్లు బతికి వస్తారనే...

By telugu teamFirst Published Feb 6, 2021, 9:20 AM IST
Highlights

క్షుద్రపూజలు చేసిన ఇద్దరు కూతుళ్లను మట్టుబెట్టిన పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులు ఇంకా భ్రమల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తమ కూతుళ్లు తిరిగి బతికి వస్తారనే వారు నమ్ముతున్నట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం: క్షుద్రపూజలు చేసిన ఇద్దరు కూతుళ్లను అత్యంత కిరాతకంగా చంపేసిన తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తం నాయుడు ఇంకా అదే భ్రమలో ఉన్నారు. వారు ప్రస్తుతం విశాఖపట్నంలోని మానసిక వైద్య శాలలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరికీ వేర్వేరు వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. అక్కడ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. 

నిందితులు ఇంకా తమ కూతుళ్లు బతికి వస్తారనే భ్రమలోనే ఉన్నట్లు తెలుస్తోంది. తమ కూతుళ్లు బతికి వస్తారనే పద్మజ అంటున్నట్లు సమాచారం. పురుషోత్తంనాయుడిని, ఆయన భార్య పద్మజను జైలు నుంచి విశాఖపట్నం మానసిక వైద్య శాలకు తరలించిన విషయం తెలిసిందే. తమ కూతుళ్లు కచ్చితంగా తిరిగి వస్తారనే పద్మజ వైద్యులతో వాదనకు దిగుతున్నట్లు చెబుతున్నారు. 

చిత్తూరు జిల్లా మదనపల్లిలో పద్మజ, పురుషోత్తం నాయుడు దంపతులు తమ కూతుళ్లు అలేఖ్య, సాయిదివ్యలను క్షుద్రపూజలు చేసి చంపేసిన విషయం తెలిసిందే. పద్మజ, పురుషోత్తంనాయుడుల మానసిక పరిస్థతి సవ్యంగా లేదని వైద్యులు గుర్తించారు. దీంతో వారికి మానసిక చికిత్స అవసరమని భావలించారు. దాంతో వారిని విశాఖపట్నం మానసిక వైద్యశాలకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. 

తానే శివుడిని అంటూ పద్మజ జైలులో పిచ్చిపిచ్చిగా అరవడం ప్రారంభించింది. దీంతో తోటి ఖైదీలు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు కూడా చెప్పారు. అరెస్టు చేసి జైలుకు తరలించే సమయంలో కూడా తానే శిపుడినని, శివుడి వెంట్రుక నుంచి వచ్చిందే కరోనా అని, అందువల్ల తనకు కరోనా పరీక్షలు చేయించకోబోనని పద్మజ మొరాయించింది.

click me!