పల్నాడులో ప్రారంభమైన ఎన్నికల కోలాహలం (వీడియో)

By AN TeluguFirst Published Feb 6, 2021, 10:19 AM IST
Highlights

ప్రకాశం జిల్లా, పల్నాడులో మూడో విడత ఎన్నికల నామినేషన్ల సందడి శనివారం నుంచి ప్రారంభమయ్యింది. ఈ ప్రాంతాల్లో  అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలను గుర్తించారని గురజాల ఆర్డీఓ జె. పార్థ సారథి వెల్లడించారు. 

ప్రకాశం జిల్లా, పల్నాడులో మూడో విడత ఎన్నికల నామినేషన్ల సందడి శనివారం నుంచి ప్రారంభమయ్యింది. ఈ ప్రాంతాల్లో  అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలను గుర్తించారని గురజాల ఆర్డీఓ జె. పార్థ సారథి వెల్లడించారు. 

"

ముఖ్యంగా పల్నాడులోని మాచర్ల, గురజాల నియోజ క వర్గాల పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోకి 134 పంచాయితీ లు, 1460 వార్డులలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.

పంచాయతీ సెక్రెటరీలనుండి, గ్రామస్థాయి అధికారుల వరకు అందరూ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఆయన కోరారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

1434 వార్డులలో 573 వార్డులను అతి సమస్యాత్మక ప్రాంతాలుగానూ, 1460 పోలీస్ స్టేషన్లలో    573 పోలీస్ స్టేషన్లను అతి సమస్యాత్మకంగానూ గుర్తించామని, 335 వార్డులు సమస్యాత్మకంగా గుర్తించామని వీటన్నింటి మీద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని తెలిపారు. 

మొబైల్ టీముల ఏర్పాటుచేశామని, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసి డైరెక్షన్లు ఇచ్చామని గురజాల ఆర్డీఓ జె. పార్థ సారథి వెల్లడించారు. 

click me!