ఏపీ రాష్ట్ర అభ్యర్థి కోసం తన వంతు కృషి చేస్తానని పారిశ్రామికవేత్త సత్వానీ ప్రకటించారు. మంగళవారం నాడు మధ్యాహ్నం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను నత్వానీ కలిశారు. తనకు రాజ్యసభ సీటును కల్పించడం పట్ట ఆయన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.
విజయవాడ: ఏపీ రాష్ట్ర అభ్యర్థి కోసం తన వంతు కృషి చేస్తానని పారిశ్రామికవేత్త సత్వానీ ప్రకటించారు. మంగళవారం నాడు మధ్యాహ్నం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను నత్వానీ కలిశారు. తనకు రాజ్యసభ సీటును కల్పించడం పట్ట ఆయన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ నుంచి పెద్దల సభకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులను తీసుకురావడంలో సీఎం జగన్ చెప్పినట్లు పనిచేస్తూ సాధించుకుంటామని తెలిపారు.
సీఎం ఏ బాధ్యత అప్పగించిన తన వంతుగా ముందుండి పూర్తిచేస్తానని అన్నారు. . తనకున్న అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న వైఎస్ జగన్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. పార్టీ ఎంపీలతో కలిసి టీమ్ వర్క్ చేస్తూ రాష్ట్రం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని' ఎంపీ నత్వానీ వెల్లడించారు.సీఎం జగన్ ను కలవడానికి ముందు నత్వానీ విజయవాడలో దుర్గమ్మను సందర్శించుకొన్నారు.