టీచర్ ను ఉతికి ఆరేసారు..ఎందుకో తెలుసా ?

First Published Nov 14, 2017, 10:57 AM IST
Highlights
  • చిత్తూరు జిల్లా వి కోట మండలంలోని ఖాజీపేట ఉర్దూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల టీచర్ ను స్ధానికులు సోమవారం చెట్టుకు కట్టేసి ఉతికి ఆరేసారు.

చిత్తూరు జిల్లా వి కోట మండలంలోని ఖాజీపేట ఉర్దూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల టీచర్ ను స్ధానికులు సోమవారం చెట్టుకు కట్టేసి ఉతికి ఆరేసారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్నది ప్రధాన ఆరోపణ. తిరుమల ప్రసాద్ అనే టీచర్ ఇంగ్లీష్ సబ్జెక్టు చెబుతాడు. పాఠాలు చెప్పే పేరుతో తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అమ్మాయిలు హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేసారు. కొద్ది రోజులు చూసిన తర్వాత హెడ్ మాస్టర్ టీచర్ కు వార్నింగ్ ఇచ్చారు. పిల్లలతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. అయినా టీచర్ బుద్ది మారలేదు.

అయితే, అమ్మాయిలు టీచర్ గురించి తమ ఇళ్ళల్లో చెప్పారు. దాంతో కొందరు తల్లిదండ్రులు స్కూల్ కు వచ్చి క్లాస్ రూంలోకి వెళ్ళి టీచర్ ను కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చారు. తర్వాత ఓ చెట్టుకు కట్టేసి ఉతికి ఆరేసారు. టీచర్ అయ్యుండి పిల్లలతో అందులోనూ అమ్మాయిలతో ప్రవర్తించే తీరు ఇదేనా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. టీచర్ ను కొడుతున్న విషయం హెడ్ మాస్టర్ దృష్టికి రాగానే వెంటనే పోలీసులకు ఫోన్ చేసారు. దాంతో పోలీసులు కూడా సీన్ లోకి ఎంటరై టీచర్ ను విడిపించారు.

తర్వాత టీచర్ విషయమై పలువురు తల్లి దండ్రులు హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేసారు. అదే విషయాన్ని హెడ్ మాస్టర్ కూడా జిల్లా విద్యాశాఖాధికారికి పంపారు. దాంతో టీచర్ ను సస్పెండ్ చేస్తూ డిఇఓ ఉత్తర్వులు జారీ చేసారు. సరే, టీచర్ మాత్రం తనకే పాపం తెలీదంటున్నారు. పిల్లలు సరిగా చదవకపోవటంతో వారం క్రితం కర్రతో కొట్టినట్లు చెప్పారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకునే ఈ విధంగా చేసారని తిరుమల ప్రసాద్ చెబుతున్నారు.

click me!