మూత్రం సేకరణకు బ్యాంకులు

First Published Nov 14, 2017, 8:57 AM IST
Highlights
  • మనుషుల మూత్రాన్ని సేకరించేందుకు త్వరలో మూత్ర బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సంచలన ప్రకటన చేసారు.

మనుషుల మూత్రాన్ని సేకరించేందుకు త్వరలో మూత్ర బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సంచలన ప్రకటన చేసారు. అంటే బ్లడ్ బ్యాంకులవంటివన్న మాట.  ఇప్పటి వరకూ సేకరిస్తున్న గోమూత్రం లాగే   మనుషుల మూత్రాన్ని కూడా సేకరించేందుకు బ్యాంకులు ఏర్పాటు చేయాలని గడ్కరీ సంచలన సూచన చేశారు. ఇంతకీ మనుషుల మూత్రం ఎందుకు సేకరించాలనుకుంటున్నారు ? అంటే మూత్రంలో యూరియా ఎరువుల ఉత్పత్తిలో అవసరమైన నత్రజని ఉంటుందట. అందుకనే మూత్ర సేకరణకు బ్యాంకుల ఏర్పాటు చేయబోతున్నారు.

రైతులు పొలాల్లో వేసే యూరియాను ఉత్పత్తి చేసేందుకు వీలుగా తాలూకా స్థాయిలో మూత్ర సేకరణకు మూత్ర బ్యాంకులు ఏర్పాటు చేయాలని గడ్కరీ కోరారు. మనుషుల మూత్రంలో నత్రజని ఉంటుందని, దీంతో యూరియాను ఉత్పత్తి చేయవచ్చని మంత్రి వెల్లడించారు. యూరియా దిగుమతిని తగ్గించేందుకు వీలుగా మన స్వదేశీ శాస్త్రవేత్తలతో దీనిపై పరిశోధన ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. మూత్రంతో యూరియా ఉత్పత్తి చేసే ప్రక్రియను నిజం చేసేందుకు నాగ్ పూర్ సమీపంలోని ధాపివాడ గరామంలో ఇప్పటికే ఓ ల్యాబ్ ను ప్రారంభించారట. నీరి సంస్థ డైరెక్టరు తపన్ చక్రవర్తి నేతృత్వంలో పది లీటర్ల డబ్బాల్లో రైతుల నుంచి మూత్రాన్ని సేకరిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు.

click me!