తల్లి దండ్రులపైనే ‘కృషి’ వెంకటేశ్వర్రావు దాడి (వీడియో)

First Published Jan 5, 2018, 2:20 PM IST
Highlights
  • కొసరాజు వెంకటేశ్వర్రావు పై కేసు నమోదైంది.

కొసరాజు వెంకటేశ్వర్రావు పై కేసు నమోదైంది. ఆయన తల్లి, దండ్రులే కేసు పెట్టటం విశేషం. ఇంతకీ కొసరాజు వెంకటేశ్వర్రావు ఎవరా అనుకుంటున్నారా? కొసరాజు వెంకటేశ్వర్రావు అనేకన్నా కృషి బ్యాంకు వెంకటేశ్వర్రావంటే వెంటనే గుర్తుపడతారేమో. ఇంతకీ కొడుకుపైనే తల్లి, దండ్రులెందుకు కేసు పెట్టారు? ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో తల్లి, దండ్రులు కోసరాజు జయసింహ-బేబి సరోజినీలపై కొడుకులే దాడికి పాల్పడ్డారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు ఇద్దరు కొడుకులపై పెదపారుపూడి పోలీసులు కేసు నమోదుచేశారు.

కృషి బ్యాంకు పేరుతో చాలా కాలం క్రితం వెంకటేశ్వర్రావు ఓ బ్యాంకు పెట్టాడు. డిపాజిటర్లకు ఎక్కువ మొత్తంలో వడ్డీ(16.5 శాతం) ఇస్తానని ఆశ చూపి భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. కుంభకోణం వెలుగులోకి రావడంతో చాకచక్యంగా 2001 జూలైలో భార్యతో కలిసి యూకే పారిపోయాడు. అక్కడ పౌరసత్వం రాకపోవడంతో మళ్లీ థాయిలాండ్‌కు పారిపోయాడు. ఈ విషయం హైదరాబాద్‌ పోలీసులకు తెలియడంతో బ్యాంకాక్‌ పోలీసులు, ఇంటర్‌ పోల్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో 2005లో బ్యాంకాక్‌లో వెంకటేశ్వర రావును అరెస్ట్‌ చేశారు. 2006, జూన్‌లో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఇంత కాలానికి మళ్ళీ కృషి వెంకటేశ్వర్రావు వార్తల్లో వ్యక్తయ్యారు.

 

click me!