నిమ్మగడ్డదే పైచేయి.. ఎస్ఈసీ కార్యాలయానికి ద్వివేది, గిరిజా శంకర్

By Siva KodatiFirst Published Jan 22, 2021, 8:27 PM IST
Highlights

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు గిరిజా శంకర్, గోపాలకృష్ణ ద్వివేది భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డతో చర్చిస్తున్నారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో భేటీ తర్వాత వీరిద్దరూ నిమ్మగడ్డ కార్యాలయానికి చేరుకున్నారు

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు గిరిజా శంకర్, గోపాలకృష్ణ ద్వివేది భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డతో చర్చిస్తున్నారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో భేటీ తర్వాత వీరిద్దరూ నిమ్మగడ్డ కార్యాలయానికి చేరుకున్నారు.

ఎస్ఈసీకి నోట్ అందజేసిన అధికారులు.. మళ్లీ నేరుగా సీఎస్‌ వద్దకు బయల్దేరారు. నిమ్మగడ్డతో చర్చించిన అంశాల్ని వీరు ఆయనకు వివరించే అవకాశాలున్నాయి. అంతకుముందు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కి నోట్ పంపారు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్.

సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినందున నిర్ణయం వెలువడే వరకు ఆగాలని అధికారులు ఎస్ఈసీని కోరారు. వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యంకాదని ప్రభుత్వం అంటోంది.

ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికలు తప్పనిసరి అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేయాల్సి వస్తుందని కోర్ట్‌కు చెప్పనుంది ప్రభుత్వం. కనీసం ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ వేసే వరకైనా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని కోర్టును కోరనుంది ప్రభుత్వం.

Also Read:మెమోను బేఖాతరు చేసిన అధికారులు: ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన నిమ్మగడ్డ

మరోవైపు ఇవాళ పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రేపు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని సిద్ధమవుతున్న ఎస్ఈసీ.. ఇందుకోసం పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది.

మధ్యాహ్నం మూడు గంటలకు తమతో సమావేశం కావాలని గోపాలకృష్ణ ద్వివేది, గిరాజ శంకర్‌ను కోరింది. అయితే వారు ఈ సమావేశానికి రాలేదు. దీంతో వారిపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సీరియస్‌గా పరిగణించారు.

చివరి అవకాశంగా సాయంత్రం 5 గంటలకు తన ముందు హాజరుకావాలని నిమ్మగడ్డ ఆదేశించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి మెమో జారీ చేసింది. 

click me!