పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్.. రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు, ఈ ట్రైన్స్ ఆలస్యం

By Siva KodatiFirst Published Jul 19, 2023, 7:09 PM IST
Highlights

తిరుపతి - సికింద్రాబాద్‌ల మధ్య తిరిగే పద్మావతి ఎక్స్‌ప్రెస్ బుధవారం పట్టాలు తప్పింది. ట్రాక్ మరమ్మత్తు పనుల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా బయల్దేరనున్నాయి. 

తిరుపతి - సికింద్రాబాద్‌ల మధ్య తిరిగే పద్మావతి ఎక్స్‌ప్రెస్ బుధవారం పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వేస్టేషన్ 6వ నెంబర్ ఫ్లాట్‌ఫాంలో ఈ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ భోగి పట్టాలు తప్పడాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెను వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. షంటింగ్ చేస్తుండగా బోగీ పట్టాలు తప్పినట్లుగా సమాచారం. ఈ ఘటన కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా బయల్దేరనున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఆలస్యమైన రైళ్లు ఇవే :

  • తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాల్సిన పద్మావతి ఎక్స్‌ప్రెస్ (12763) రాత్రి 19.45కి బయల్దేరనుంది. 
  • తిరుపతి నుంచి నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (12793) రాత్రి 20.00 గంటలకు బయల్దేరనుంది. 

ఇదిలావుండగా.. ఒడిషాలోని బాలేశ్వర్‌లో గతంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బాలేశ్వర్ వద్ద ట్రాక్ మరమ్మత్తు పనులు చేస్తుండగా.. సిగ్నలింగ్ పొరపాటు చోటు చేసుకుంది. దీంతో మరమ్మత్తులు చేస్తున్న ట్రాక్ మీదకు రైలు దూసుకుపోయింది. దీనిని గమనించిన లోకో పైలెట్ అత్యంత సమమస్పూర్తితో వ్యవహరించి బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. 
 

click me!