పద్మజకు వదలని క్షుద్రపిచ్చి: కరోనా టెస్టుకు నో, నా శరీరం నుంచే...

Published : Jan 26, 2021, 01:07 PM ISTUpdated : Jan 26, 2021, 01:13 PM IST
పద్మజకు వదలని క్షుద్రపిచ్చి: కరోనా టెస్టుకు నో, నా శరీరం నుంచే...

సారాంశం

మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన దంపతుల్లో ఒకరైన తల్లి పద్మజ కరోనా టెస్టుకు సహకరించలేదు. తాను శివుడినని ఆమె వైద్యులకు చెప్పింది.

మదనపల్లి:  మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన దంపతుల్లో ఒకరైన తల్లి పద్మజ కరోనా టెస్టుకు సహకరించలేదు. తాను శివుడినని ఆమె వైద్యులకు చెప్పింది.మూఢ భక్తితో చిత్తూరు జిల్లాలోని  మదనపల్లిలో ఇద్దరు కూతుళ్లను తల్లి పద్మజ, తండ్రి పురుషోత్తం నాయుడు హత్య చేశారు. చనిపోయిన తర్వాత ఇద్దరు కూతుళ్లను బతికిస్తామని తల్లిదండ్రులు నమ్మించారు.

also read:మూఢ భక్తితో మదనపల్లిలో కూతుళ్ల హత్య: తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఇద్దరు కూతుళ్లను చంపిన తర్వాత తల్లిదండ్రులు కూడ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.ఈ కేసులో మంగళవారం నాడు పురుషోత్తంనాయుడు ఆయన భార్య పద్మజను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో పద్మజ కరోనా టెస్టుకు సహకరించలేదు.

కరోనా  టెస్టు చేయించుకోవడానికి ఆమె ఇష్టపడలేదని పోలీసులు చెప్పారు. తాను శివుడిగా చెప్పుకొన్నారు. తనకు కరోనా టెస్టు ఏమిటని ఆమె వైద్యులను ప్రశ్నించారు.తనకు ఇలాంటి టెస్టులు అవసరం లేదని ఆమె వైద్యులకు తేల్చి చెప్పారు.  కరోనా చైనా నుండి రాలేదని చెప్పారు. చెత్తను కడిగేయడానికి కరోనాను తన శరీరం నుండి పంపించినట్టుగా చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!