
గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మానవత్వం చాటుకున్నారు. వేడుకలు చూడడానికి వచ్చిన 99 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి లక్ష్మీనారాయణ ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోయారు.
"
వెంటనే గమనించిన తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ వుండవల్లి శ్రీదేవి లక్ష్మీ నారాయణను హుటాహుటిన అంబులెన్సులో గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి లక్ష్మీనారాయణకి వైద్యం అందించారు. సకాలంలో వైద్యం అందించడంతో లక్ష్మీనారాయణ ప్రాణపాయం నుంచి బయటపడ్డారు.
ఎమ్మెల్యేగానే కాకుండా డాక్టర్‌గా వెంటనే స్పందించి ఓ నిండు ప్రాణాన్ని కాపడటంతో ఎమ్మెల్యే శ్రీదేవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.