పాడేరు బస్సు ప్రమాదం: నాలుగుకు పెరిగిన మృతుల సంఖ్య.. సీఎం జ‌గ‌న్ దిగ్భ్రాంతి

Published : Aug 21, 2023, 01:54 AM IST
పాడేరు బస్సు ప్రమాదం: నాలుగుకు పెరిగిన మృతుల సంఖ్య.. సీఎం జ‌గ‌న్ దిగ్భ్రాంతి

సారాంశం

Alluri Sitharama Raju District: పాడేరు ఆర్టీసీ బ‌స్సు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4కు పెరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 10 మంది తీవ్రంగా గాయపడగా, మిగిలిన 18 మంది స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను పాడేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  

Paderu RTC bus accident: పాడేరు ఆర్టీసీ బ‌స్సు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4కు పెరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 10 మంది తీవ్రంగా గాయపడగా, మిగిలిన 18 మంది స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను పాడేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వివ‌రాల్లోకెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డు వ్యూపాయింట్ వద్ద చెట్టు కొమ్మను దాటే ప్రయత్నంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 10 మంది తీవ్రంగా గాయపడగా, మిగిలిన 18 మంది స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను పాడేరు ప్రభుత్వాసుపత్రికి తరలించామ‌నీ,  ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయ‌ని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో  సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడ లేవు. దీంతో ప్రమాదం జరిగిన విషయం  బయట ప్రపంచానికి  తెలపడానికి సమయం పట్టిందని బాధితులు చెబుతున్నారు.

పాడేరు ప్ర‌మాదంపై సీఎం జ‌గ‌న్ దిగ్భ్రాంతి..

ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లు, ఆయా జిల్లాల పోలీసు బలగాలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టి సారించాలని సీఎం పేర్కొన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే