AP Rains: బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. : ఐఎండీ

By Mahesh RajamoniFirst Published Aug 21, 2023, 12:12 AM IST
Highlights

Vijayawada: వ‌చ్చే మూడు రోజుల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సాధార‌ణం నుంచి మోస్తారు వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచ‌నా వేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. కృష్ణా, గుంటూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రించింది.
 

Andhra Pradesh Rains: వ‌చ్చే మూడు రోజుల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సాధార‌ణం నుంచి మోస్తారు వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచ‌నా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. కృష్ణా, గుంటూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రించింది.

వివ‌రాల్లోకెళ్తే.. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనీ, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాగల మూడు రోజుల పాటు కృష్ణా, గుంటూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. దీంతో  మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. తెలంగాణలో కూడా వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తెలంగాణ‌లో కూడా సాధార‌ణ చిరుజ‌ల్లుల నుంచి మోస్తారు వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచ‌నా వేసింది. పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

click me!