బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో లేనందున ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. అయితే మంత్రివర్గంలో తన పేరు లేదనే ప్రచారంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి హైబీపికి గురయ్యారు.
అమరావతి:జగన్ మంత్రివర్గం నుండి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం నాడు వెళ్లారు. సీఎం జగన్ తో భేటీ ముగిసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. మంత్రివర్గ కూర్పు విషయమై జగన్ ఆలోచనలను సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పంచుకున్నారు. ఏపీ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ విషయమై సీఎం జగన్ కసరత్తు చేస్తున్న సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి హై బీపీ వచ్చింది. దీంతో ఆయనను వైద్యులు పరీక్షించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలి మంత్రివర్గంలో Balineni Srinivasa reddyతో పాటు Adimulapu Suresh మంత్రులుగా కొనసాగారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మాత్రం అవకాశం దక్కకపోవచ్చనే ప్రచారం సాగుతుంది. అయితే ఇదే జిల్లా నుండి మంత్రి గా పనిచేసిన ఆదిమూలపు సురేష్ కు మాత్రం మరోసారి కేబినెట్ లో కొనసాగించవచ్చనే ప్రచారం కూడా సాగుతుంది. ఈ విషయ,మై మీడియాలో కథనాలు వస్తున్న సమయంలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి హై బీపీ వచ్చింది.
బీపీతో ఇబ్బంది పడుతున్న శ్రీనివాస్ రెడ్డిని Sajjala Ramakrishna Reddy పరామర్శించారు.. అయితే మంత్రివర్గం కూర్పు విషయమై సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివరించినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు సామాజిక సమీకరణాల నేపథ్యంలో సురేష్ న కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్న విషయాన్నికూడా సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వివరించే అవకాశం లేకపోలేదు. ముఖ్యమంత్రి తరపున బాలినేని శ్రీనివాస్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి బుజ్జగించేందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు. మంత్రి వర్గం నుండి తప్చించిన మంత్రులను పార్టీ కోసం ఉపయోగించుకోనున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో బలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ వైపునకు వచ్చారు. అయితే జగన్ కు అత్యంత సన్నిహితుడిగా కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పేరుంది. ఈ సమయంలో కేబినెట్ నుండి తప్పనిసరి పరిస్థితుల్లోనే పక్కన పెట్టాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొనే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి బదులుగా మరొకరికి కేబినెట్ లో చోటు కల్పించాల్సిన అవసరం వచ్చిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి గతంలో మంత్రి వర్గంలో ఉన్నఇద్దరిని తప్పిస్తే నష్టం లేదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. సురేష్ ను మంత్రివర్గంలో కొనసాగించి తనను తప్పించడంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు.అయితే ఏ కారణాలతో సీఎం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే విషయమై బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి వివరిస్తున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల్, విడుదల రజని, జోగి రమేష్, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్ నాథ్, కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్లు ఖరారైనట్టుగా ప్రచారం సాగుతుంది. ఇవాళ సాయంత్రానికి రాజ్ భవన్ కు కొత్త మంత్రుల పేర్లను సీఎం జగన్ పంపనున్నారు. అంతేకాదు సీఎంఓ నుండి కూడా కొత్త మంత్రులుగా ప్రమాణం చేసే వారికి కూడా సీఎం స్వయంగా ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంది.