ఏపీ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ : మంత్రుల రాజీనామాలకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం.. కాసేపట్లో గెజిట్ నోటిఫికేషన్

Siva Kodati |  
Published : Apr 10, 2022, 02:48 PM IST
ఏపీ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ : మంత్రుల రాజీనామాలకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం.. కాసేపట్లో గెజిట్ నోటిఫికేషన్

సారాంశం

మంత్రుల రాజీనామాలను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. కేబినెట్ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో మంత్రులంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే

ఏపీ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ (ap cabinet reshuffle) నేపథ్యంలో మంత్రులు చేసిన రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (biswabhusan harichandan) ఆమోదించారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి సీఎం జగన్‌కు లేఖలు అందజేశారు. వీటిని నిన్న సాయంత్రం రాజ్‌భవన్‌కు పంపింది. తాజాగా వీటికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీనికి సంబంధించి మరికాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫేషన్ ద్వారా తెలియజేయనుంది. 

మరోవైపు. ముఖ్యమంత్రి YS Jaganతో ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy, సీఎంఓ అధికారులు ఆదివారం నాడు భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణకు సంబంధించి సీఎం జగన్ చర్చిస్తున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత రాజ్ భవన్ కి కొత్త మంత్రుల జాబితాను ప్రభుత్వం పంపనున్నారు. గత మంత్రివర్గం నుండి 10 మందికి చాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే కొత్తగా 25 మందికి అవకాశం కల్పించనున్నారు. మంత్రి వర్గ కూర్పుకు సంబంధించి సామాజిక సమీకరణాలు, ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితులపై కూడా చర్చిస్తున్నారు.  ఈ మేరకు కేబినెట్ లో  చోటు దక్కనుంది. అయితే Cabinetలో చోటు దక్కుతుందనే  ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద వారి అభిమానులు సందడి చేస్తున్నారు.

విశాఖపట్టణం జిల్లాలో గుడివాడ అమర్ నాథ్ కు కేబినెట్ లో చోటు దక్కిందనే ప్రచారంతో ఆయన అభిమానులు అమర్ నాథ్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేశారు. అయితే తనకు ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని అమర్ నాథ్ చెప్పారు. సీఎం ఏ బాధ్యత అప్పగించినా కూడా తాను క్రమశిక్షణగా నిర్వహిస్తానని అమర్ నాథ్ చెప్పారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి కేబినెట్ లో బెర్త్ దక్కిందనే ప్రచారం కావడంతో  గోవర్ధన్ రెడ్డి అభిమానులు ఆయనను సన్మానించారు. స్వీట్లు తినిపించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద సంబరాలు నిర్వహించారు. మరో వైపు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కిందనే ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు.మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్న వారిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల్, విడుదల రజని, జోగి రమేష్, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్ నాథ్, కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్లు  ఖరారైనట్టుగా ప్రచారం సాగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ ముగిసిన తర్వాత కొత్త మంత్రుల పేర్లు సీఎం జగన్ రాజ్‌భవన్ కు పంపనున్నారు. దీనికి గవర్నర్  ఆమోదం తెలిపిన తర్వాత కొత్త మంత్రులకు సీఎంఓ నుండి సమాచారం అందనుంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!