
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తన జీవితాశయంగా చంద్రబాబు చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మించటం తన కలగా చెప్పుకుంటున్న సిఎంకు ప్రతిపక్ష వైసీపీ నేతలు కురసాల కన్నబాబు, పార్ధసారధి కొన్ని ప్రశ్నలు సంధించి సమాధానాలివ్వాల్సిందిగా డిమాండ్ చేసారు. అందులో కొన్ని.
2-విభజన చట్ట ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకున్నది ?
3-ప్రాజెక్టు బాధ్యత రాష్ట్రం తీసుకున్నాక అంచనా వ్యయం రూ. 16 వేల కోట్ల నుండి రూ. 40 వేల కోట్లకు ఎందుకు పెరిగింది ?
4-వ్యత్యాసాన్ని కేంద్రం భరిస్తుందా? లేకపోతే రాష్ట్రమే సమీకరించుకుంటుందా ?
5-ప్రాజెక్టుకు టి. అంజయ్య హయాంలో బీజం పడి, దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కార్యరూపం దాల్చటం నిజం కాదా?
5-ప్రాజెక్టు ముంపు బాధితులకు న్యాయం చేయమని జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తుంటే, ప్రాజెక్టుకే వైసీపీ అడ్డం పడుతోందని ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు ?
6- పట్టిసీమ ద్వారా సీమకు నీళ్ళు మళ్ళిస్తున్నట్లు చెబుతున్నా ఇప్పటికీ జీవో ఎందుకు ఇవ్వలేదు ?
7-2010-11లో ప్రాజెక్టు అంచనా వ్యయంలో రూ. 16 వేల కోట్లకు మించి ఇచ్చేది లేదని కేంద్రం తేల్చిచెప్పటం నిజం కాదా?
8-ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్నీ అనుమతులనూ దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చింది నిజం కాదా?
9-నీటి నిల్వ సామర్ధ్యం లేని పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కేవలం కమీషన్ల కోసమే చేపట్టింది నిజం కాదా?
10-పోలవరం అంచనా వ్యయం రూ. 40 వేల కోట్లకు పెంచేసిన తర్వాత కల ఎలా నెరవేరుతుందనుకుంటున్నారు చంద్రబాబు?...
ఇలాంటి ప్రశ్నలు వైసీపీ నేతలు చంద్రబాబుకు చాలానే వేసారు. మరి చంద్రబాబు సమాధానాలు చెబుతారో లేదో చూడాలి.