ప్రజావేదిక కూల్చివేతకు ఏడాది: కరకట్ట వద్ద హైడ్రామా

By Sreeharsha GopaganiFirst Published Jun 25, 2020, 11:16 AM IST
Highlights

కరకట్ట, దాని చుట్టుపక్కల ప్రాంతాలవద్ద వద్ద హైటెన్షన్ నెలకొంది. ప్రజా వేదికకు వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. కరకట్ట వద్ద ఎలాంటి నిరసనలకు అనుమతి లేనందున, తాము ఎటువంటి నిరసనలకు అనుమతించబోమని పోలీసులు చెబుతున్నారు. 

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజావేదికను కూల్చి  నేటికి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రజావేదిక శిథిలాల వద్దకు టీడీపీ నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 

దీంతో కరకట్ట, దాని చుట్టుపక్కల ప్రాంతాలవద్ద వద్ద హైటెన్షన్ నెలకొంది. ప్రజా వేదికకు వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. కరకట్ట వద్ద ఎలాంటి నిరసనలకు అనుమతి లేనందున, తాము ఎటువంటి నిరసనలకు అనుమతించబోమని పోలీసులు చెబుతున్నారు. 

దీంతో కరకట్ట వద్ద టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఇంటికి వెళ్లే మార్గాన్ని పూర్తిగా బ్లాక్ చేసారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది.తమను ఎందుకు వెళ్లనివ్వడంలేదని పలువురు టీడీపీ నేతలు పోలీసులను ప్రశ్నించారు. 

ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనువుగా ఉంటుందని, గ్రీవెన్స్ హాల్ గా దీన్ని చంద్రబాబు నిర్మించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇది అక్రమ కట్టడం అని చెబుతూ దీన్ని కూల్చడం జరిగింది. 

 

అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి ప్రజా వేదికను నిర్మించారని  కలెక్టర్ల సమావేశంలో సీఎం వైఎస్  జగన్ అప్పట్లో ప్రకటించారు.అక్రమంగా నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేయాలని  కలెక్టర్ల సమావేశం నుండే జగన్ అధికారులను ఆదేశించారు. ఆ వెంటనే అధికారులు సైతం రంగంలోకి దిగారు. 

ఈ భవనాన్ని తనకు కేటాయించాలని చంద్రబాబునాయుడు లేఖ రాసినా కూడ సీఎం ఎలాంటి సమాధానం రాని విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అక్రమంగా ఈ భవనాన్ని నిర్మిస్తే అదే భవనంలో ఎందుకు సమావేశం పెట్టారో చెప్పాలని టీడీపీ నేతలుగతంలో ప్రశ్నించారు. 

ప్రజా వేదికను కూల్చివేయాలని సీఎం ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కలెక్టర్ల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యల గురించి టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

ప్రజా వేదిక నిర్మాణానికి సీఆర్‌డీఏ అనుమతి కూడ లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు నివాసం కూడ అక్రమంగానే నిర్మించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఇక ఈ ప్రజావేదిక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్దతిలో నిర్మించినందున దాన్ని కూల్చవద్దంటూ వేరే ఎక్కడైనా ఏర్పాటు చేయండని టీడీపీ శ్రేణులు కోరినా.... అక్రమ కట్టడాల కూల్చివేతలన్నీ ఇక్కడి నుండే ప్రారంభిస్తామని అన్నారు జగన్. 

click me!